Threaten call to Vijayashanti: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Threats calls to Senior actress Vijayashanti and her husband: నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల కింద చంద్రకిరణ్‌రెడ్డి తమను సంప్రదించి, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్‌గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు వివరించారు.
చంద్రకిరణ్‌రెడ్డి తమతో కలిసి పనిచేస్తూ తన సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నారని, స్వలాభం కోసం తమ పేరును వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని పనితీరు నచ్చకపోవడంతో చంద్రకిరణ్ సేవలను వినియోగించుకోలేదని చెప్పారు. తాము బీజేపీలో ఉన్నప్పుడు అతడితో పరిచయం ఏర్పడిందన్నారు. బీజేపీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ మమ్మల్ని వాడుకున్నారని వివరించారు. బీజేపీలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అతడు నుంచి మెసేజ్ వచ్చిందని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని ఉందని చెప్పారు.
ఈ క్రమంలో తమ వద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 6న చంద్రకిరణ్‌రెడ్డి బెదిరింపు సందేశం పంపాడని చెప్పారు. బకాయిలు తీర్చకుంటే మీరు శత్రువులు అవుతారని మెసేజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయని తెలిపారు. చంద్రకిరణ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు.