Published On:

AAI Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. రూ.లక్షకు పైగా శాలరీ!

AAI Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.. రూ.లక్షకు పైగా శాలరీ!

AAI Recruitment: నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఛాన్స్. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ (ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండాలి) పాసైన అభ్యర్థులకు ఈ  ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులవుతారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మే 24 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

మొత్తం వెకెన్సీల సంఖ్య: 309

ముఖ్యమైన డేట్స్..

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 24

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 25

 

వయోపరిమితి:

2025 ఏప్రిల్ 24 నాటికి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 27 ఏళ్ల లోపు  వయస్సు కలిగి ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

 

ఉండాల్సిన విద్యార్హతలు:

ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్  డిగ్రీ లేదా బీటెక్ పాసై ఉండాలి.

 

దరఖాస్తు విధానం:

ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి..

 

దరఖాస్తు ఫీజు:

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉండును. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి  ఉండదు.

 

ఉద్యోగానికి సెలెక్ట్ చేసే విధానం:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్‌స్టెన్‌సెస్ టెస్ట్, సైకాలజీకల్ అసెసిమెంట్ , ఫిజికల్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

 

వేతనం:

ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను  సంప్రదించవచ్చు.

 

అఫీషియల్ వెబ్ సైట్: https://www.aai.aero/

 

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 309

దరఖాస్తుకు చివరి తేది: మే 24

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారికి భారీ వేతనం ఉంటుంది. సెలెక్ట్ అయిన వారికి రూ.40,000 నుంచి రూ.1,40,000 వేతనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి: