Operation Akarsh Deal: తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, చర్యలు తీసుకోండి.. ఈసీకి భాజపా వినతి
తెలంగాణాలో సంచలనం సృష్టించిన వందల కోట్ల ఎమ్మెల్యేల కొనుగోళ్ల డీల్ వ్యవహరం హస్తినకు చేరుకొనింది. సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస పార్టీ ప్రయత్నిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
New Delhi: తెలంగాణాలో సంచలనం సృష్టించిన వందల కోట్ల ఎమ్మెల్యేల కొనుగోళ్ల డీల్ వ్యవహరం హస్తినకు చేరుకొనింది. సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస పార్టీ ప్రయత్నిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మీడియా వ్యవహారాల ఇన్ చార్జ్ అనిల్ బలూనీ, ఓం పాఠక్ ల బృందం ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్లింది. తమ పార్టీ పరువును దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని భాజపా ఫిర్యాదులో పేర్కొనింది. Operation Akarsh Deal: ప్రలోభాల డీల్ ఆడియో క్లిప్పులను విడుదల చేసిన తెరాస పార్టీ..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భాజపా నేతలు, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. మునుగోడులో ఓటమిని గుర్తించే, అధికార పార్టీ తెరాస ఇలాంటి తప్పుడు మార్గాన్ని ఎంచుకునిందని మండిపడ్డారు. ఆడియో టేపుల్లో ఎవరైన ఎవరి పేర్లైనా చెప్పవచ్చని అన్నారు. సంతోష్ అన్న పేరు చెప్పినంత మాత్రానా నిజంగా మారిపోతుందా అని నేతలు ప్రశ్నించారు. అలా అయితే బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ పేరు కూడా చెప్పవచ్చని వారు ఉదహరించారు.
ఇది కూడా చదవండి: Operation Akarsh: ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్.. హైకోర్టుకు పోలీసులు
Minister KTR: మీడియా ముందు నోరుజారద్దు.. పార్టీ శ్రేణులకు కేటిఆర్ సూచన