Bathukamma sarees: బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిధ్దం
తెలంగాణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Hyderabad: తెలంగాణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి మొత్తం 24 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరలను తయారు చేయించారు.
గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయించడం జరిగింది. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభంకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. వీటికోసం ప్రభుత్వం 340 కోట్ల రూపాయిలనుఖర్చు చేసింది ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలతో చాలా మందికి ఉపాధి లభిస్తోంది.