Last Updated:

International Cricket Stadium: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తరహాలోనే మరో అధునాతన క్రికెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

International Cricket Stadium: తెలంగాణలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

Hyderabad: తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి కోసం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తరహాలోనే మరో అధునాతన క్రికెట్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధిలో భాగంగా 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల అధ్యక్ష క్రికెట్ క్రీడా సంఘాలను ఏర్పాటు చేసి, తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

జీహెచ్ఎంసీతో పాటు 13 నగర పాలక సంస్థల్లో హెచ్‌సీఐకి అనుబంధంగా క్రికెట్ క్లబ్‌లను స్థాపించాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని క్రికెట్ క్లబ్‌లను హెచ్‌సీఏకి అనుసంధానం చేసి, శిక్షణ, ఇతర వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. భవిష్యత్ అవసరాల దృష్ట్యాల హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో 2004లో ఉప్పల్‌ స్టేడియం ప్రారంభమైంది. ఉప్పల్ స్టేడియంలో 55 వేల మంది కూర్చునే సామర్థ్యముంది. ఇక్కడ 2005లో ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. 2010 నవంబరులో ఇండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్, 2017 అక్టోబరులో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది.

ఇవి కూడా చదవండి: