Last Updated:

Raithu Bazar : ఏపీ లో రైతు బజార్ల సిబ్బందికి జీతాలపెంపు

ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Raithu Bazar : ఏపీ లో రైతు బజార్ల సిబ్బందికి జీతాలపెంపు

Raithu Bazar: ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న జీతాలను 23 శాతం పెంచింది. విశాఖ, విజయవాడ, గుంటూరులోని రైతు బజార్ల ఎస్టేస్ ఆఫీసర్లకు రూ.21 వేల నుంచి 26 వేల రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. సూపర్ వైజర్లకు 15 వేల నుంచి 18, 500కు వేతనాలు పెరిగాయి. మిగిలిన కార్పొరేషన్లు, పట్టణాలు, ఇతర ప్రాంతాల్లోని రైతు బజార్లలో ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.19,500 నుంచి 24 వేల రూపాయలకు, అదే సూపర్ వైజర్లకు రూ.12 వేల నుంచి రూ15 వేలకు జీతం పెరిగింది. ఇక సెక్యూరిటీ గార్డుల వేతనం విషయానికి వస్తే.. ప్రాంతాలతో సంబంధం లేకుండా 12 వేల రూపాయల నుంచి 15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 100 రైతు బజార్లు ఉండగా.. ప్రతి రైతు బజారుకు ఓ ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్లు లేని చోట సూపర్ వైజర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. స్థానిక మార్కెట్ కమిటీలే 2021 వరకు ఈ ఖర్చులు భరించేవి. ప్రభుత్వ చర్యల ఫలితంగా 76 రైతు బజార్లు స్వయం సమృద్ధి సాధించాయి. ఏటా రూ.11.87 కోట్ల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రైతు బజార్లు కూడా స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది జీతాలను పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం 75 మంది ఎస్టేట్ ఆఫీసర్లు, 28 మంది సూపర్ వైజర్లు, 212 మంది సెక్యూరిటీ గార్డులు, మరో ఐదుగురు హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో 188 మంది కాంట్రాక్టు, 132 మంది అవుట్ సోస్రింగ్ లో పని చేస్తున్నారు. వీరి జీతాల కోసం ప్రతి నెలా రూ. 57 లక్షలు, రైతు బజార్ల నిర్వహణకు మరో 50 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది.

ఇవి కూడా చదవండి: