Pawan Kalyan: శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్
జనసేన కార్యకర్తలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు.
Pawan Kalyan: జనసేన కార్యకర్తలకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయిచేసుకున్నారని పవన్ తెలిపారు. ఇది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. సుమోటోగా కేసు తీసుకున్నందుకు మానవ హక్కుల కమిషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదుపై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్పందించారు. అంజూ యాదవ్ చర్యలపై కమిటి వేసి, విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దిష్టిబొమ్మ దహనాన్ని నివారించే క్రమంలో అలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. సీఐకి చార్జ్ మెమో ఇవ్వలేదని వెల్లడించారు. హెచ్‌ఆర్సీ నుంచి నోటీస్ వచ్చిందన్న ఎస్పీ.. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం లేదని తెలిపారు.
జనసేనానికి ఘనస్వాగతం..(Pawan Kalyan)
ఇక సేనాని పర్యటన సందర్భంగా.. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గరి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సేనానికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యకర్తలతో కలిసి సేనాని.. ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు బయలుదేరారు. ఎస్పీ కార్యాలయానికి బయలుదేరిన సేనానికి ప్రజలు నీరాజనం పట్టారు. జనసేన అధినేతను చూడటానికి కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చారు, దాంతో ఎస్పీ కార్యాలయం దగ్గర కోలాహలంగా మారింది. ఇక క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి అధికారులు అదనపు బలగాలను రప్పించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం సేనాని.. నేరుగా హస్తిన బయలుదేరారు.
తిరుపతికి వచ్చిన జనసేన అధినేతకు అధికారులు షరతులు విధించారు. సేనానితో పాటు కేవలం ఎనిమిది మందికి మాత్రమే అనుమతిని ఇచ్చారు. పవన్ తో పాటు బాధితుడు కట్టేసాయి, జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, రాందాస్ చైదరి, కిరణ్ రాయల్, రాజారెడ్డి, నగరం వినుత, అడ్వకేట్లు కంచి శ్యామల, అమరనారాయణకు అధికారులు అనుమతినిచ్చారు., ఇక జనసేనాని రాకతో తిరుపతి జనసేన పార్టీలో నూతనోత్సాహం వచ్చింది. కార్యకర్తపై చేయి చేసుకుంటేనే స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో.. పార్టీలో జోష్ నిండింది. ఇక పవన్ పై స్థానిక వైసీపీ, టీడీపీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు.