Last Updated:

Vande Bharat: వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Vande Bharat: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వందేభారత్ దేశమంతటా పలు పట్టణాల్లో పరుగులు పెడుతోంది. అయితే పలు కారణాల వల్ల ఇటీవలె కాలంలో జరిగిన వందేభారత్ రైలు ప్రమాదాలను చూశాం. కాగా ఈ సారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటల చెలరేగాయి.

Vande Bharat: వందేభారత్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Vande Bharat: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వందేభారత్ దేశమంతటా పలు పట్టణాల్లో పరుగులు పెడుతోంది. అయితే పలు కారణాల వల్ల ఇటీవలె కాలంలో జరిగిన వందేభారత్ రైలు ప్రమాదాలను చూశాం. కాగా ఈ సారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటల చెలరేగాయి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

ప్రయాణికులు సురక్షితం(Vande Bharat)

భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం ఉదయం రైలు కోచ్ లో మంటలు చెలరేగాయి. వందేభారత్ ఉదయం 5.40 గంటలకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బయలుదేరి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కాగా రైలు మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌ సమయంలో ఒక కోచ్‌లో దట్టమైన పొగలతో కూడిన అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. దీనిని గమనించిన రైల్వే అధికారులు కుర్వాయి కేథోరా స్టేషన్‌‌లో రైలును నిలిపివేశారు. ఇకదానితో అక్కడి అగ్నిమాపక దళ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని టెక్నికల్ సమస్యనా లేదా అధికారులు నిర్లక్ష్యమా అనే విషయాలపై రైల్వేశాఖ విచారణ చేపట్టనుంది. ఈ రైలు టెస్టింగ్ తర్వాత త్వరలో బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.