Last Updated:

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. నేడు సుప్రీం కోర్టులో విచారణ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో.. సీబీఐ పులివెందులకు రావడం చర్చనీయంశంగా మారింది. అయితే నేడు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందోనని తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.

నేడు సుప్రీం కోర్టు విచారణ.. (Viveka Murder Case)

వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం పులివెందులలో సీబీఐ మరోసారి తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోమవారం సుప్రీం కోర్టు విచారణ నేపథ్యంలో.. సీబీఐ పులివెందులకు రావడం చర్చనీయంశంగా మారింది. అయితే నేడు సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందోనని తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.

వైఎస్ వివేకా హత్య కేసు ఏపీలో సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ బృందం మరోసారి పరిశీలించింది. హత్య జరిగిన బాత్రూం.. బెడ్ రూమ్ లను పరిశీలించారు.

వివేకా ఇంటికి సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి పలు వివరాలను సేకరించారు. ఆ తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి వద్ద టైపిస్టుగా పని చేసిన ఇనాయతుల్లాను విచారించారు.

హత్య అనంతరం.. వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లా కుటుంబ సభ్యులకు పంపించారు.

భాస్కర్ రెడ్డి విచారణ..

ఆదివారం సీబీఐ భాస్కర్ రెడ్డితో పాటు.. ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించింది. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది ఎవరు.

దానికి తగ్గట్టు ప్రచారం చేయడంలో మీ పాత్ర ఏంటి..? అని వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ ప్రశ్నించింది.

హత్య జరిగిన ప్రాంతంలో రక్తపు మరకల్ని భాస్కర రెడ్డి శుభ్రం చేయించారని సీబీఐ అనుమానిస్తోంది. ఇదే విషయంపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

హత్య జరిగిన వెంటనే.. ఉదయ్‌కుమార్‌రెడ్డి ఇంటినుంచి బయటకు రావడంపై విచారణ సాగింది.

ఈ కేసులో గత కొన్ని రోజులుగా తాము చేసిన విచారణకు సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకుని, సీబీఐ బృందం దిల్లీ వెళ్లింది.

సోమవారం సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది.

ఈ కేసులో అరెస్టు చేసిన వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలతో పాటు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డినీ సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.

విచారణలో వెల్లడైన అంశాలతో పాటు సాంకేతిక ఆధారాలనూ తీసుకుని ఈ బృందం దిల్లీ వెళ్లినట్లు సమాచారం.