Last Updated:

Maha Padayatra: 19వ రోజుకు చేరుకొన్న అమరావతి రైతుల మహా పాదయాత్ర

ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.

Maha Padayatra: 19వ రోజుకు చేరుకొన్న అమరావతి రైతుల మహా పాదయాత్ర

Amaravati: ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.

ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో పాదయాత్ర నిర్విఘ్నంగా సాగుతుంది. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుండి నేడు పాదయాత్రను రైతులు ప్రారంభించారు. ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది. సూర్యచంద్ర రావుపేట, గొల్లగూడెం మీదుగా సాగుతూ తిమ్మాపురంలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకొంటారు. అనంతరం ద్వారకా తిరుమలకు చేరుకొంటారు.

వైకాపా మినహాయించే అన్ని ప్రతిపక్ష పార్టీలు రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపిన క్రమంలో ఏలూరు తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, మాగంటి బాబు, పీతల సుజాత, జవహర్, చింతమనేని ప్రభాకర్, ముక్కిడి వెంకటేశ్వర రావు, జయరాజ్, బాపిరాజు పలువురు ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో విశేషంగా ఆకర్షిస్తున్న శ్రీవారి రధానికి స్థానికులు దారిపొడువునా హారతులు ఇచ్చి స్వాగతాలు పలుకుతున్నారు.

ఇది కూడా చదవండి: కనకదుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే వెల్లంపల్లి హల్ చల్

ఇవి కూడా చదవండి: