Published On:

YS Sharmila on Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila on Phone Tapping: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

AP Congress President YS Sharmila on Phone Tapping in Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తన ఫోన్‌తోపాటు భర్త, దగ్గరి వారి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నిర్దారించారని పేర్కొన్నారు. ఆనాడు ట్యాపింగ్ జరిగిన తన ఆడియో ఒకటి తనకు వినిపించారని తెలిపారు.

 

ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరారు. ఆనాడు వైఎస్ జగన్, కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. తెలంగాణలో తనను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కేందుకు ఇద్దరు కలిసి భారీ స్కెచ్ వేశారన్నారు. అందులో భాగంగా వేసిన స్కెచ్ ఫోన్ ట్యాపింగ్ అని ఆరోపించారు.

 

నన్ను తొక్కి పెట్టాలని చూశారు..

ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిస్తే మీరు ఏం చేశారని తనను అడగొచ్చన్నారు. ఆనాడు ఉన్న పరిస్థితులు వేరు అన్నారు. అప్పుడు వైఎస్ జగన్, కేసీఆర్ చేసినవన్నీ అరాచకాలేనని స్పష్టం చేశారు. వీరి అరాచకాలతో పోలిస్తే ఫోన్ ట్యాపింగ్ చిన్నది అన్నారు. తను జగన్‌కు తోడబుట్టిన చెల్లెలు అని మరిచిపోయారన్నారు. తనను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని కుట్ర చేశారని ఆరోపించారు. తన భవిష్యత్‌ను పాతిపెట్టాలని ఎన్నో చేశారని, తనకు మద్దతు పలికిన వాళ్లను బెదిరించారని తెలిపారు. రాజకీయంగా తన వాళ్లు రానివ్వకుండా చేశారని మండిపడ్డారు. తను తెలంగాణలో పార్టీ పెట్టడానికి వైఎస్ జగన్‌కు ఏమి సంబంధం లేదని తెలిపారు. కేసీఆర్ కోసం తనను తొక్కి పెట్టాలని చూశారని ఆరోపించారు. తన చుట్టూ పరిస్థితులను కష్టతరం చేశారని, నా ప్రతి పోరాటానికి అడ్డుపడ్డారన్నారు. ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజమని ఆమె స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: