Published On:

YS Jagan – Pushpa Dialogue: వైఎస్‌ జగన్‌ నోట రప్ప రప్ప పుష్ప మూవీ డైలాగ్‌..!

YS Jagan – Pushpa Dialogue: వైఎస్‌ జగన్‌ నోట రప్ప రప్ప పుష్ప మూవీ డైలాగ్‌..!

Ys Jagan React On Pushpa Movie Dialogue: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పుష్ప-2 మూవీలోని ‘రప్పా.. రప్పా’ డైలాగ్‌ కొట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని డైలాగ్‌ పోస్టర్‌ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు.

 

పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పోస్టర్‌లో వైఎస్‌ జగన్‌ ఫొటో ఉండటంతో అది కాస్తా ట్రెండ్‌లోకి వచ్చింది. పోస్టర్‌ వివాదాస్పదంగా మారడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ విషయం మీడియా సమావేశంలో విలేకరులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

 

గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతామని జగన్‌ మొదట డైలాగ్‌ చెప్పారు. పుష్ప-2 మూవీ డైలాగులు, పుష్ప సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు?. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? అని ప్రశ్నించారు.

 

2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతామని ఒక్కొక్కడిని అని ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పక్కా టీడీపీ మనిషి అని తేలింది. గతంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన జగన్‌.. చంద్రబాబు పాలనపై విరక్తితో టీడీపీ శ్రేణులు.. ఇలా తమ అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారేమోనని అని జగన్‌ ప్రెస్‌మీట్‌ ముగించారు.

 

ఇవి కూడా చదవండి: