Last Updated:

Purandeswari : జగన్ సర్కారు వైఫ్యల్యాలపై కేంద్రమంత్రి నిర్మలమ్మకు లేఖ రాసిన పురంధేశ్వరి

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు

Purandeswari : జగన్ సర్కారు వైఫ్యల్యాలపై కేంద్రమంత్రి నిర్మలమ్మకు లేఖ రాసిన పురంధేశ్వరి

Purandeswari : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు చేస్తోందంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏయే విధంగా అప్పులు చేసిందనే వివరాలను లేఖలో పేర్కొన్నారు.

నాలుగేళ్ల వైసీపీ పాలనలో రూ.7.15 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకుందని.. ఉద్యోగులకివ్వాల్సిన  పీఎఫ్ క్లైమ్స్.. డీఏలు కూడా భారీగా పెండింగులో ఉన్నాయని దుయ్యబట్టారు. లిక్కర్ ఆదాయం తాకట్టు పెట్టి ఇప్పటికే తీసుకున్న అప్పులే కాకుండా మరిన్ని అప్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని లేఖలో స్పష్టం చేశారు. అలానే ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని.. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయని గతంలో పురంధేశ్వరి తెలిపిన విషయం విదితమే.. ఏపీకి కేంద్రం 25 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని.. గడచిన తొమ్మిదేళ్లలో రూ.20 వేల కోట్లు ఒక్క పీఎమ్‌ఏవై కింద ఇచ్చిందని తెలిపారు.

BPurandeswari

ఇక, ఆంధ్రప్రదేశ్‌కి ఎన్‌ఆర్‌జీపీ కింద 2022 – 23 వరకు 8 వేలకు కోట్లకు పైగా వచ్చాయని.. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత‌ బియ్యం అందుతోందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.. ఈ ఏడాది బియ్యం ద్వారా 10 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందన్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతీ రైతుకు రూ.12 వేలు ఇస్తామన్న హమీ ఏమైందని ప్రశ్నించారు.. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్‌ల అకౌంట్‌లలోకి నిధులు విడుదల చేస్తుంటే ప్రభుత్వం పక్కదారి పట్టించిందని మండిపడ్డారు.