Foods must avoid in Breakfast: ఉదయాన్నే అల్పాహారంలో వీటిని అసలు తీసుకోకండి..!
Foods must avoid in Breakfast: ఆరోగ్యమే.. మహాభాగ్యమని ఆరోగ్య నిపుణులు తరుచుగా చెబుతుంటారు. సృష్టిలో ఆరోగ్యాన్ని మించిది లేదనే సందేశం భారతీయ సంప్రదాయాల్లో కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం బిజీ లైఫ్ నేపథ్యంలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఇందులో భాగంగానే కొంతమంది ఉదయాన్నే అల్సాహారంలో చాలా తప్పులు చేస్తుంటారు. ఆరోగ్యవంతమైన జీవనశైలిలో అల్పాహారం ప్రధానమైంది. ఉద్యోగాల నిమిత్తం హడావిడిగా ఏవి పడితే అవి తెలియకుండానే తింటున్నాం. అందుకే పోషకాహార లోపం లేకుండా ఈ పొరపాట్లు చేయకూడదని నిపుణులు సలహాలు ఇస్తున్నారు.
ఉదయాన్నే అల్పాహారంగా బిస్కెట్లు, బ్రెడ్, జామ్స్, బట్టర్ ఇలా తీసుకుంటున్నారు. సమయం ఆదా చేసుకునేందుకు చాలామంది ఎక్కువగా వీటిని తింటున్నారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంతగా మంచివి కావని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, అల్సాహారంగా పండ్లు, చక్కెరకు సంబంధించిన పదార్థాలు, స్వీట్లు తీసుకోవడం మంచిది కాదు. ఇవి ఖాళీ కడుపున తీసుకోవడంతో ఆ రోజంతా మత్తుగా ఉంటుంది. ముఖ్యంగా నిమ్మ, నారింజచ ద్రాక్ష వంటి పుల్లటి పండ్లతో చేసిన రసాలు తీసుకుంటే మలబద్ధకానికి దారి తీస్తుంది.
జీవనశైలిలో భాగంగా చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తీసుకోవడం సాధారణం. అయితే ఇందులో కెఫిన్ ఉండడంతో కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక, కొంతమంది ఉదయం లేచిన వెంటనే అంతకుముందు రోజు మిగిలిన కూరలు, అన్నం తింటున్నారు. రాత్రి మిగిలిన భోజనాన్ని ఫ్రిజులో పెట్టి ఉదయాన్నే తీసుకుంటున్నారు. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది. భోజనాన్ని ఫ్రిజులో పెట్టడంతో బాక్టీరియా చేరుతుందని, కావున అలా తీసుకోవద్దని సూచిస్తున్నారు.