Sonali Phogat: సోనాలి పోగాట్ ఆస్తుల విలువ రూ.110 కోట్లు
సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్.
Sonali Phogat Death: సోనాలి పోగాట్ హత్య జరిగి సుమారు పది రోజులు కావస్తోంది. విచారణలో కొత్త కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. అయితే హత్యకు గల కారణాలపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతం సోనాలి హత్యకు ప్రధాన కుట్రదారుడు మాత్రం ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్. సోనాలి మొత్తం ఆస్తి విలువ సుమారు 110 కోట్ల రూపాయలుగా ఉంటుందని చెబుతున్నారు. ఆమె ఫామ్ హౌజ్ విలువ 96 కోట్లు ఉంటుందని అంచనా. సాంగ్వాన్ సోనాలికి చెందిన హిసార్ ఫామ్ హౌజ్‌ను దక్కించుకునేందుకు హత్య చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
సుధీర్ సంగ్వాన్ మాత్రం తన నేరాన్ని అంగీకరించాడు. సోనాలి పోగాట్‌కు తానే డ్రగ్స్ ఇచ్చానని ఒప్పుకున్నాడు. అయితే సోనాలిని హత్య చేసి ఆమె ఆస్తులు, డబ్బు దక్కించుకోవాలని సుధీన్ దీర్ఘకాలంగా ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదీ కాకుండా సుధీర్ ఆమెకు క్రమంగా డ్రగ్స్ అలవాటు చేసి డ్రగ్ అడిక్టెడ్‌గా చేశాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సోనాలి పోగాట్ 110 కోట్ల ఆస్తులు ఆమె కుమార్తె యశోధార పోగాట్‌కు దక్కుతాయి. సోనాలి బంధువుల సమాచారం ప్రకారం ఆమె భర్త సంజయ్ పోగాట్‌కు హిసార్‌లో 13 ఎకరాల భూమి ఉన్నట్లు చెబుతున్నారు. సుమారు ఆరు కోట్ల రూపాయలతో ఫామ్ హౌజ్ రిసార్టు నిర్మించారని, ప్రస్తుతం ఆమె భూముల విలువ ఎకరా 7 కోట్ల నుంచి 8 కోట్లు పలుకుతుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సోనాలి భూముల విలువే 96 కోట్లుగా ఉంటుందని, దీంతో పాటు రిసార్ట్ విలువ 6 కోట్లు, సంత్‌నగర్‌లో ఉన్న ఆమె ఇల్లు, దుకాణాలు కలిపి సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేస్తాయని, అలాగే ఆమెకు మూడు వాహనాలున్నట్లు బంధువులు చెబుతున్నారు.
ప్రస్తుతం సుధీర్ సంగ్వాన్ గోవా పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం ఈ కేసులో కీలక వ్యక్తి శివం అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే సంగ్వాన్కు శివం అత్యంత సన్నిహితుడు. కాగా సోనాలి ఫామ్ హౌజ్‌లో ఉన్నప్పడు శివం అక్కడే ఉండేవాడు. సోనాలి మృతి సంఘటన తర్వాత నుంచి శివం కనిపించుకుండా పోయాడు. ఆమె ల్యాప్‌టాప్, డీవీఆర్ ద్వారా పోలీసులకు కీలకమైన సమాచారం లభించవచ్చు. సోనాలి మృతికి గల కారణాలు తెలియవచ్చునని బంధువులు, మిత్రులు అభిప్రాయపడుతున్నారు.