Last Updated:

Somu Veerraju: జనసేన మాతో ఉంటే హ్యాపీ.. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ కామెంట్స్

పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ గా మారాయి.

Somu Veerraju: జనసేన మాతో ఉంటే హ్యాపీ.. పవన్ వ్యాఖ్యలపై బీజేపీ కామెంట్స్

Somu Veerraju: పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ గా మారాయి.

ఛలో కొండగట్టులో భాగాంగా కొండగట్టులో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడారు. జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉందని స్పష్టం శారు.

తన సిద్దాంతాలకు అనుగుణంగా ఉన్న పార్టీలతో కలిసి వెళతామన్నారు. తనతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని పవన్ అన్నారు.

ఒక వేళ పొత్తులు కుదరకపోతే జనసేన ఒంటరిగ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకూడదని తేల్చి చెప్పారు.

ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి.. సమయం వచ్చినపుడు పొత్తులపై ఆలోచిస్తామని పవన్ తెలిపారు.

జనసేన మాతో ఉంటే హ్యపీ

కాగా, పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. ‘జనసేన మాతో ఉంటే హ్యపీ.

బీజేపీతోనే ఉన్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందులో ఎలాంటి గందరగోళం లేదు. కానీ, టీడీపీ, వైసీపీ రాష్ట్ర హితాన్ని కోరవు.

కాబట్టి టీడీపీ, వైఎస్సార్సీపీ ని మేము వ్యతిరేకిస్తున్నాం. కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం’ఆయన స్పష్టం చేశారు.

కనక దుర్గమ్మకు పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు విజయవాడలో కనక దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. పవన్‌కు ఆలయ అధికారులు సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

గుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఘాట్ రోడ్డులో ఉన్న వారాహికి పూజ నిర్వహించారు.

కొండ దిగువన ఘాట్ రోడ్డు టోల్ గేట్ వద్ద వారాహికి పూజ నిర్వహించారు.

మంగళవారం ఉదయం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా విజయవాడకు బయలుదేరి వచ్చారు.

 

పవన్ పర్యటన సందర్భంగా ఆలయం వద్ద పవన్ అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు.

ముందుగా వారాహి వాహనాన్ని మంగళగిరి నుంచి విజయవాడకు తీసుకువచ్చారు.

ఈ క్రమంలో అడుగుడుగునా జనసేన అభిమానులు, నేతలు వారాహి తో సెల్ఫీ లు తీసుకునేందుకు పోటెత్తారు.

పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

 

ఈ పూజ కార్యక్రమాల అనంతరం పవన్ తిరిగి మంగళగిరి లోని పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారు.

అక్కడ పార్టీ నాయకులతో పార్టీ భవిష్యత్తు రాజకీయాల గురించి చర్చించనున్నారు.

పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన నేతలు ఉన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/