Last Updated:

Rajasthan: సీసీ టీవీ కేబుల్ ను తాడుగా చేసి.. రాజస్దాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ

రాజస్థాన్‌లోని జైలు నుండి 35 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్వెద్ అనే ఖైదీ ఫిబ్రవరి 25 నుండి బరాన్ జిల్లా జైలులో ఉంటున్నాడు.

Rajasthan: సీసీ టీవీ కేబుల్ ను తాడుగా చేసి.. రాజస్దాన్ జైలు నుంచి తప్పించుకున్న  ఖైదీ

Rajasthan:రాజస్థాన్‌లోని జైలు నుండి 35 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్వెద్ అనే ఖైదీ ఫిబ్రవరి 25 నుండి బరాన్ జిల్లా జైలులో ఉంటున్నాడు.

మధ్యాహ్నం పారిపోతే రాత్రికి తెలిసింది..(Rajasthan)

జాన్వెద్ సీసీటీవీ కేబుళ్లను ఉపయోగించి 20 అడుగుల ఎత్తైన ఎలక్ట్రిక్ కంచెను దూకి తప్పించుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.ఫెన్సింగ్‌లో రంధ్రం ఉపయోగించి నిందితుడు తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. జాన్వెద్ బుధవారం మధ్యాహ్నం జైలు ప్రాంగణం నుండి పారిపోయాడు. సాయంత్రానికి గాని ఈ సంఘటన వెలుగులోకి రాలేదు.రాత్రి ఖైదీల పూర్తి సంఖ్య లెక్కింపు జరిగింది. అపుడు ఒక ఖైదీ తప్పించుకున్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి అధికారులకు సమాచారం ఇవ్వబడింది. కేసు నమోదు చేసి అతనికోసం గాలిస్తున్నట్లు జైలు ఇన్ చార్జి చెప్పారు.

దుప్పట్లను తాడుగా చేసి పారిపోయారు..

రాజస్థాన్ లో ఖైదీలు జైలు నుండి తప్పించుకోవడం ఇది మొదటిసారి కాదు. గత ఏడాది జూన్‌లో, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు బన్ స్వారా జిల్లా జైలు నుండి దుప్పట్లు ఉపయోగించి తప్పించుకున్నారు.వారు 12 అడుగుల పొడవు గల లోపలి సరిహద్దు గోడను దూకారు. తరువాత 20 అడుగుల బయటి గోడను వారు దుప్పట్లతో చేసిన తాడు సహాయంతో దూకారు. దీనికోసం గోడలో రంధ్రం చేశారని జైలర్ చెప్పారు.

దేశంలోని జైళ్లలో మూడొంతులమంది ఖైదీలు అండర్ ట్రయల్ ఖైదీలే..

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలోని జైళ్లలో మూడొంతుల మంది ఖైదీలు అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్నారు.554,034 మంది ఖైదీలలో, 427,165 లేదా 77 శాతం మంది 2021లో అండర్ ట్రయల్‌గా ఉన్నారు. ఇది 2020లో జైలులో ఉన్న 371,848 మంది అండర్ ట్రయల్‌ల నుండి 14.9 శాతం పెరుగుదల.జిల్లా జైళ్లలో అత్యధికంగా అండర్ ట్రయల్‌ల వాటా 51.4 శాతం, సెంట్రల్ జైళ్లు (36.2 శాతం) మరియు సబ్-జైళ్లు (10.4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.అండర్ ట్రయల్‌ల సంఖ్య పెరగడమే కాదు, ఖైదీలను ఉంచే జైళ్ల సామర్థ్యం కూడా మించిపోయింది. సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వ్స్ ప్రకారం, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అధికారులు పాటిస్తే జైలులో అండర్ ట్రయల్‌ల సంఖ్యను తగ్గించవచ్చు.

నేరం మోసపూరితంగా జరిగితే ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షను విధిస్తే తప్ప అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ దీనిని విస్మరిస్తున్నారు.దేశవ్యాప్తంగా పోలీసులు స్వల్ప ఆరోపణల ఆధారంగా అరెస్టులను కొనసాగిస్తున్నారని గోన్సాల్వేస్ అన్నారు. కోర్టు యొక్క ఈ ఉత్తర్వును స్వయంగా అమలు చేయడం వల్ల దేశంలోని ఖైదీల సంఖ్య సగానికి తగ్గుతుందన్నారు.అండర్ ట్రయల్‌లు జైలులో ఉండడానికి కేసుల పెండింగ్‌లే ప్రధాన కారణం. 2021 చివరి నాటికి 14.4 మిలియన్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉండటంతో, భారతీయ న్యాయస్థానాలు ఆ సంవత్సరంలో మొత్తం పెండెన్సీ శాతం 91.2గా ఉన్నాయి.దేశంలో అండర్ ట్రయల్‌ల సంఖ్య పెరగడానికి న్యాయవ్యవస్థ యొక్క జాప్యం ప్రధాన కారకాల్లో ఒకటి. చాలా కాలంగా పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని నేషనల్ పోలీస్ అకాడమీ మాజీ డైరెక్టర్ శంకర్ సేన్ అన్నారు.