Last Updated:

Weather Update: మరో 5రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Weather Update: మరో 5రోజుల పాటు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్

Weather Update: ఇప్పటికే వర్షాలతో రాష్ట్రం తడిసిముద్దవుతుంటే.. మరల ఈ నెల 14వరకు వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి,
హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.

సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వానలు పడాయని తెలిపింది.

గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణ కేంద్ర సూచన మేరకు అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ ఊర్లల్లో సూర్యుడే ఉదయించడు తెలుసా..!

ఇవి కూడా చదవండి: