Last Updated:

Flavored Condoms Intoxication: ఫ్లేవర్ కండోమ్‌లతో మత్తులో మునుగుతున్న విద్యార్దులు.. ఎక్కడో తెలుసా?

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుండి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చంది. ఇక్కడ యువత ఫ్లేవర్ కండోమ్‌లకు అలవాటు పడుతున్నారు, యువత పెద్ద ఎత్తున ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేసి వాటితో మత్తులో మునుగుతున్నారు

Flavored Condoms Intoxication: ఫ్లేవర్  కండోమ్‌లతో  మత్తులో మునుగుతున్న విద్యార్దులు.. ఎక్కడో తెలుసా?

Flavored Condoms Intoxication:పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుండి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇక్కడ యువత ఫ్లేవర్ కండోమ్‌లకు అలవాటు పడుతున్నారు, యువత పెద్ద ఎత్తున ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేసి వాటితో మత్తులో మునుగుతున్నారు. వారు సువాసనగల కండోమ్‌ను గోరువెచ్చని నీటిలో సుమారు గంటసేపు నానబెడతారు. ఒక గంట నానబెట్టిన తర్వాత, వారు ఆ నీటిని తాగడంతో 10 నుండి 12 గంటలకు పైగా మత్తులో ఉంటున్నారు. దీనితో వీటిని ఎక్కుగా కొనుగోలు చేస్తున్నారు.

సులువుగా దొరకడంతో..( Flavored Condoms Intoxication)

యువకుల వ్యసనం దుర్గాపూర్‌లో ఫ్లేవర్ కండోమ్‌ల విక్రయాలను పెంచింది. ఈ ప్రాంతంలో ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌ల విక్రయాలు జోరుగా సాగడానికి కారణాలేమిటన్నది పరిశీలించాగా ఒ క విద్యార్ది ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.చాలా మంది విద్యార్థులు దుర్గాపూర్‌లోని హాస్టళ్లలో నివసిస్తున్నారు. వీరిలో పలువురు మద్యం, సిగరెట్లు, ఇతర రకాల వ్యసనాలకు అలవాటు పడ్డారు. అయితే, ఈ ఉత్పత్తులు కండోమ్‌లతో పోలిస్తే ఖరీదైనవి.కండోమ్‌లు మెడికల్ స్టోర్‌లలో సులువుగా దొరుకుతాయి. ఏదైనా మెడికల్ షాపు నుండి కండోమ్‌లు కొనడానికి వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. విద్యార్థులు ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌ల వ్యసనంలో మునిగిపోవడానికి ఇవి కొన్ని కారణాలు. దుర్గాపూర్ సిటీ సెంటర్, బిధాన్‌నగర్, బెనాచిటీ, దుర్గాపూర్‌లోని ముచిపర వంటి ప్రాంతాల్లో కండోమ్‌ల విక్రయాలు భారీగా పెరిగాయని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో కండోమ్‌ల విక్రయాలు భారీగా పెరగడంతో దుకాణదారుడు ఒక విద్యార్థిని దీని గురించి అడిగాడు. తాను మత్తుకోసం రోజూ ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నానని సదరు విద్యార్థి వెల్లడించాడు. విద్యార్దులు ఎక్కువమంది ఈ ఫ్లేవర్ కండోమ్‌లు కొనడానికి ముందుకు రావడంతో ఇక్కడ కొన్ని షాపుల్లో వీటి స్టాకు అయిపోయిందని తెలుస్తోంది.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం..

అయితే ఫ్లేవర్ కండోమ్‌లలో విషపూరిత సమ్మేళనాలు ఉండవచ్చని, అవి క్యాన్సర్‌కు కారణమవుతాయని ఓక మెడికల్ షాపు యజమాని పేర్కొన్నాడు. మత్తు కోసం ఇలాంటి చౌకబారు పద్దతులను మానుకోవాలని అతను యువకులను హెచ్చరించాడు. ఇది ప్రస్తుతానికి బాగున్నట్లు అనిపించినా భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని అతను తెలిపాడు.