Last Updated:

Polar Nights: ఆ ఊర్లల్లో సూర్యుడే ఉదయించడు తెలుసా..!

కొన్ని రాత్రులను మరవలేము. ఈ రాత్రంతా ఇలానే ఉంటే ఎంత బాగుండో అని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం కాదా. కొన్ని నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా. నిజమేనండి ఆ ఊర్లల్లో శీతాకాలంలో కొద్ది రోజుల పాటు సూర్యుడు ఉదయించని రోజులు ఉంటాయంట వాటిని పోలార్ నైట్స్ అంటారు అలా సుదీర్ఘంగా రాత్రిగానే ఉండే ఊర్లేంటో తెలుసుకుందామా.

Polar Nights: ఆ ఊర్లల్లో సూర్యుడే ఉదయించడు తెలుసా..!

Polar Nights: కొన్ని రాత్రులను మరవలేము. ఈ రాత్రంతా ఇలానే ఉంటే ఎంత బాగుండో అని ఏదో ఒక సందర్భంలో అనుకునే ఉంటాం కాదా. కొన్ని నెలల పాటు అసలు సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా. నిజమేనండి ఆ ఊర్లల్లో శీతాకాలంలో కొద్ది రోజుల పాటు సూర్యుడు ఉదయించని రోజులు ఉంటాయంట వాటిని “పోలార్ నైట్స్” అంటారు అలా సుదీర్ఘంగా రాత్రిగానే ఉండే ఊర్లేంటో తెలుసుకుందామా.

భూమి తన అక్షం మీద ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది. దానితో ధ్రువాల దగ్గర ఉండే ఆర్కిటిక్‌ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్లలో శీతాకాలంలో సూర్యుడు ఉదయించడు. అలాంటి వాటిలో ముఖ్యమైనది

  • అమెరికా దేశం అలాస్కా రాష్ట్రానికి చెందిన ఉట్‌కియాగ్విక్. మంచు కొండల మధ్య చక్కగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో నవంబర్‌ 15 నుంచి 19 మధ్య కాలం వరకే సూర్యుడు కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ జనవరి 20 తర్వాతే ఉదయిస్తాడు. అంటే దాదాపు రెండు నెలలు పాటు ఆ ఊర్లో పొద్దుపొడవదు.
  • నార్వే దేశంలోని ‘ట్రాంసో’ ప్రాంతంలోనూ నవంబర్‌ చివరి వారం నుంచి జనవరి మధ్య వరకూ ఈ సుదీర్ఘరాత్రి ఉంటుంది.
  • నార్వేలోని స్వాల్‌బార్డ్‌లోనూ అక్టోబర్‌ తొలివారం నుంచి ఫిబ్రవరి చివరి వరకు అంటే దాదాపు నాలుగు నెలలు రాత్రి మాత్రమే ఉంటుంది. అందులోనూ నవంబర్‌ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మచీకటి ఉంటుంది.
  • అంతేకాకుండా అయనోస్పియర్‌లో సౌరవాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్‌, నైట్రోజన్‌ అణువులను ఢీకొట్టిన కారణంగా కొన్ని ప్రాంతాల్లో రంగురంగుల్లో దర్శనమిచ్చే “అరోరా బొరియాలిస్‌” కూడా కనువిందు చేస్తాయి.

మరి ఈ రాత్రులను ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఓ సారి ట్రిప్ వెయ్యండి అన్నింటిని అనుభూతి చెందితేనే కదా జీవితం యొక్క పరమార్ధం అర్ధమవుతుంది.

ఇదీ చదవండి: జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన రోడ్ ట్రిప్స్ ఇవే..

 

ఇవి కూడా చదవండి: