KTR Comments: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం.. తొలిసారి స్పందించిన కేటీఆర్
KTR Comments: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో.. ఆందోళన చేస్తున్న బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
KTR Comments: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో.. ఆందోళన చేస్తున్న బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అవగాహన లేకుండా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
యువతను రెచ్చగొడుతున్నారు.. (KTR Comments)
బండి సంజయ్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఞాని అని విమర్శించారు. రాజకీయ కుట్రలో భాగంగానే యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాజపా, భారాస మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ మేరకు కేటీఆర్ తాజాగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ ప్రభుత్వ సంస్థ కాదని.. ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. ప్రభుత్వ సంస్థకు.. స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థకు తేడా తెలియదని అన్నారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు అంటగట్టి భాజపా నాయకులు యువతలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా బండి సంజయ్ స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఆ రాష్ట్రంలో వందసార్లు పేపర్ లీక్..
భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నపత్రం లీక్ అయింది.
ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా? నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం.
ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు టీఎస్‌పీఎస్సీకి అందిస్తాం.
రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలి అని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
యువత ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని.. నాయకుల రెచ్చగొట్టె వ్యాఖ్యలకు ఆకర్షితులు కావొద్దని కేటీఆర్ యువతకు సూచించారు.
తమ పార్టీ ప్రయోజనాల కోసం, యువత ఉద్యోగాల ప్రిపరేషన్ పక్కన పడేయాలన్న దుర్మార్గుడు బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పారు.