Last Updated:

CSK vs KKR: ఓడినా మనసులు గెలిచారు.. చెన్నైపై కోల్‌క‌తా విజయం

CSK vs KKR:  చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హోంటీంపై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. 145 పరుగుల ల‌క్ష్యాన్ని 18.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీనితో ఆరు వికెట్ల తేడాతో కోల్‌క‌తా జట్టు గెలుపొందింది.

CSK vs KKR: ఓడినా మనసులు గెలిచారు.. చెన్నైపై కోల్‌క‌తా విజయం

CSK vs KKR:  చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో హోంటీంపై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. 145 పరుగుల ల‌క్ష్యాన్ని 18.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. దీనితో ఆరు వికెట్ల తేడాతో కోల్‌క‌తా జట్టు గెలుపొందింది. 33 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన కోల్‌క‌తా జట్టును రింకూ సింగ్‌ కెప్టెన్ నితీశ్ రాణా ఆదుకున్నారనే చెప్పాలి. 43 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లతో 54 పరుగులతో రింకూ సింగ్, 44 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్స్‌ తో 57 పరుగులతో నాటౌట్ గా నితీశ్ రాణా నిలిచి అర్ధ‌శ‌త‌కాల‌తో జట్టును విజయం పథంవైపు నడిపించారు. జేస‌న్ రాయ్‌(12), ర‌హ్మానుల్లా గుర్బాజ్(1), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(9) పరుగులు మాత్రమే చేసి పెలివియన్ చేరిన తరుణంలో నాలుగో వికెట్ కు దిగిన వీరిద్ద‌రు నాలుగో వికెట్‌కు 99 ప‌రుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నై బౌల‌ర్ల‌లో దీప‌క్ చాహ‌ర్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

ఇకపోతే మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 144 ప‌రుగులు మాత్రమే చేసింది. 72 ప‌రుగుల‌కే కీలక ఐదు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న చెన్నై జట్టును శివ‌మ్ దూబే 34 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్స్ తో 48 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి ఆదుకున్నాడు. మిగిలిన వారిలో 28 బంతుల్లో 3 ఫోర్లు బాది 30 పరుగులు చేసిన డెవాన్ కాన్వే ప‌ర్వాలేద‌నిపించ‌గా రుతురాజ్ గైక్వాడ్(17), అజింక్యా ర‌హానే(16), అంబ‌టి రాయుడు(4), మొయిన్ అలీ(1) రన్స్ చేసి విఫ‌లం అయ్యారు. ఇక కోల్‌క‌తా బౌలర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సునీల్ న‌రైన్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

ప్లేఆఫ్స్ ఛాన్స్

మ్యాచ్ ఓడినా సరే సీఎస్కేకు ప్లేఆఫ్స్ ఆవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పాయింట్ల పట్టిక 15 పాయింట్లతో చెన్నై జట్టు రెండో స్థానంలో నిలిచింది.

నా ఆటోగ్రాఫ్(CSK vs KKR)

ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌లో హోంటౌన్లో సీఎక్సేకు ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తమ జట్టును సపోర్ట్ చెయ్యడానికి వచ్చారు. ఇక మ్యాచ్ ముగిశాక.. చెన్నై ఆటగాళ్లు మైదానమంతా కలియతిరుగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. టెన్నిస్‌ రాకెట్లను పట్టుకుని జెర్సీలను టెన్నిస్ బాల్స్ ను అభిమానుల వైపు విసురుతూ.. సీఎస్‌కే జెండాతో ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఇదంతా ఒకెత్తు అయితే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్‌ సునీల్ గావస్కర్‌ సైతం మైదానంలోకి వచ్చి ‘కెప్టెన్ కూల్‌’ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.