Published On:

Jr NTR-SS Rajamouli: మరోసారి జక్కన్నతో ఎన్టీఆర్‌ – ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ బయోపిక్‌లో తారక్‌

Jr NTR-SS Rajamouli: మరోసారి జక్కన్నతో ఎన్టీఆర్‌ – ‘ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ బయోపిక్‌లో తారక్‌

Jr NTR To Play Dada Saheb Phalke Role SS Rajamouli Made in India: ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ తర్వాత మరోసారి మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌, దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి జతకట్టబోతున్నారు. వీరిద్దరు కాంబో మరో భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యిందని, ఇందులో తారక్‌.. సినీ పితామహుడు (ఫాదర్ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా)గా గుర్తింపు దాదా సాహెబ్‌ ఫాల్కే ధుండిరాజ్‌ గోవింద ఫాల్కేగా కనిపించబోతున్నాడు.

 

ఆయన బయోపిక్‌గా రూపొందే ఈ సినిమాలో ఎన్టీఆర్‌.. దాదా సాహెబ్ ఫాల్కే పాత్ర పోషించబోతున్నాడట. ఈ మేరకు మూవీకి సంబంధించి చర్చలు కూడా అయిపోయాయి. దేవర 2, ఎన్టీఆర్‌-ప్రశాంత్‌నీల్‌ మూవీ తర్వాత తారక్‌ ఈ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టనున్నాడంటూ పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ బయోపిక్‌కి అప్పుడే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారట. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సుమారు రెండేళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్‌ని ప్రకటించారు. అయితే నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఎవరూ నటిస్తారనేది మాత్రం చెప్పలేదు.

 

దీంతో ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్నట్టు బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు జక్కన్న దర్శకత్వ బాధ్యతలు కాకుండ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారట. ఆయన సమర్పణలో నితిన్‌ కక్కర్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దాదాసాహెబ్‌ ఫాల్కే ధుండిరాజ్‌ గోవింద్‌ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో తారక్‌ నటించనున్నారు. భారతీయ సినిమా పితామహుడిగా భావించే దాదాసాహెబ్‌ జీవితం అందరరినీ ప్రభావితం చేసేలా ఉండటంతో ఆయన జీవిత కథను సినిమా వెండితెరపై తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

 

దాదాసాహెబ్‌ ఫాల్కే ఆయనను భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. 1870లో జన్మించిన ఆయన 1944లో కన్నుమూశారు.  1913లో భారతదేశ మొదటి సినిమా “రాజా హరిశ్చంద్ర”ను ఆయనే తెరకెక్కించారు. అప్పటి నుంచి భారతీయ సినీ దర్శకుడిగా, నిర్మాతగా మొదలైన ఆయన ప్రయాణం నడు ప్రపంచస్థాయి గుర్తించే దిశగా అడుగులేస్తుంది. దాదాసాహెబ్‌ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు ఇండియన్‌ మూవీ ఇండస్ట్రలోనే అత్యున్నత పురస్కారంగా భావిస్తారు. చలనచిత్రం రంగంలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డుతో సత్కరిస్తారు.