Last Updated:

Natural Star Nani : ఒకప్పుడు నానిని అవమానించిన డైరెక్టర్ అతడేనా.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ?

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది.

Natural Star Nani : ఒకప్పుడు నానిని అవమానించిన డైరెక్టర్ అతడేనా.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ?

Natural Star Nani : నాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న విడుదల కాబోతుండగా.. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఈ మేరకు నాని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమా గురించి పలు విశేషాలను పంచుకుంటున్నారు.

దక్షిణాదితో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నాని కెరీర్ తొలినాళ్లలో తాను పడ్డ అవమానాల గురించి ఓ ఇంటర్వూలో  చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఓ దర్శకుడు అందరి ముందు తనను అవమానించాడని అన్నారు. అయితే అందుతున్న తాజా సమాచారం మేరకు.. ఆ డైరెక్టర్ ఒకప్పుడు కామెడీ చిత్రాలు తీసి.. ఇప్పుడు ఖాళీగా ఉన్న ఓ  స్టార్ డైరక్టర్ అని నెటిజన్లు అంతా భావిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నానికి మద్దతుగా పోస్ట్ లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

కాగా నాని కెరీర్ ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు స్వర్గీయ బాపు తెరకెక్కించిన ‘రాధా గోపాలం’ అనే సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ తర్వాత రాఘవేంద్రరావు, శ్రీనువైట్ల, పలువురు దర్శకుల దగ్గర  కూడా పని చేశాడు. ఈ క్రమంలోనే ఇంద్రగంటి మోమన్‌కృష్ణ తెరకెక్కించిన ‘అష్టాచమ్మా’ అనే సినిమాతో నాని హీరోగా కెరీర్‌ను ప్రారంభించి..ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అంతకు ముందు ఇంటర్వ్యూ లో నాని(Natural Star Nani) ఏం చెప్పారంటే ..

అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటే.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే ఎన్నో అవమానాలు పడాల్సి ఉంటుందని అన్నారు. ఎవరైనా సరే ఏదైనా చెప్పేయవచ్చునని అనుకుంటారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని.. అయితే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా అన్నిటినీ దిగమింగక తప్పదని అన్నారు. క్లాప్ బోర్డు ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారని.. అయితే మాటలు పడినందుకు తానెప్పుడూ బాధపడలేదని అన్నారు. కానీ ఒక దర్శకుడు మాత్రం సెట్ లో అందరి ముందు తనను అవమానించాడని, ఎప్పటికీ దర్శకుడివి కాలేవురా అని అన్నాడని గుర్తు చేసుకున్నారు. ఆ మాట తనను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని, ఇలాంటి ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని అన్నారు. స్టార్ హీరో అయ్యాక ఆ దర్శకుడ్ని కలిశానని.. కానీ అతని ఈగో మాత్రం తగ్గలేదని.. అప్పుడు కూడా ప్రతికూల వాతావరణమే ఉందని అన్నారు. ఈ క్రమంలో ఆ దర్శకుడు ఎవరనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది.