Andhra Pradesh: కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కొందరు పోలీసులు
Andhra Pradesh: ఏపీలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. కనీసం పోలీస్ మ్యాన్యువల్స్ కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో శాంతి భద్రతలు కాపాడేందుకు ఓ పక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే మరో పక్క కొందరు పోలీసుల తీరు కూటమి పాలనను ప్రశ్నార్ధకం చేస్తోంది.
ఒకరకంగా కొందరి పోలీసులకు ఇంకా పాత వాసనలు పోవడం లేదు. సోమవారం రోజు విజయవాడలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. అయితే అక్కడికి చేరుకున్న ఓ సీఐ రామచంద్రయాదవ్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆయనకు వై ప్లస్ కేటగిరీ ఉన్నా కూడా కనీసం మ్యాన్యువల్ తెలియకుండా వ్యవహరించారు.
రామచంద్ర యాదవ్‌ను ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులే సీఐ తీరుకు షాక్ అయ్యారు. కాసేపటికి తేరుకొని సీఐని అడ్డుకున్నారు. కానిస్టేబుళ్లకు తెలిసిన పోలీస్ మ్యానువల్ ఓ సీఐకి తెలియకపోవడం చాలా బాధాకరమని ప్రజలు అంటున్నారు. అప్పటికీ అక్కడున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది చెబుతున్నా వినయకుండా ఆ సిఐ ఆగ్రహంతో ఊగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవహరించినదానికంటే దారుణంగా వ్యవహరించారు. ఈ సీఐపై చర్యలు తీసుకోవాలని బిసివై పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.