Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షాలు
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
Tamil Nadu: తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
రాష్ట్రంలో వరదల పరిస్థితిని కంట్రోల్ రూమ్ నుంచి సీఎం స్టాలిన్ సమీక్షిస్తున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో మూడు రోజులు పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తంభించిపోయింది. వైగా జలాశయం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ప్రవాహం అధికంగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కావేరి నదికి వరద పోటెత్తింది. వరద నీరు కారణంగా ముంపు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు.