Last Updated:

Rahul Gandhi: ఎట్టకేలకు చిన్న ఏనుగుకు చికిత్స.. రాహుల్ గాంధీ పోస్టుతో అప్రమత్తమై..

నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే..

Rahul Gandhi: ఎట్టకేలకు చిన్న ఏనుగుకు చికిత్స.. రాహుల్ గాంధీ పోస్టుతో అప్రమత్తమై..

Karnataka: నేరుగా చెబితే రాజకీయం అంటారు. దాన్నే ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే రాజకీయ చాణుక్యుడు అంటారు. ఇదే తీరును రాహుల్ గాంధీ కర్ణాటకలో తన భారత్ జోడో యాత్రలో కనపరిచాడు. దీని ద్వారా ఓ ప్రాణికి సకాలంలో వైద్య సేవలు అందేలా చేశాడు. ఇదంతా సోషల్ మీడియా పవర్ గా చెప్పాల్సిందే.

వివరాల్లోకి వెళ్లితే, మైసూరు పరిసర ప్రాంతాల్లో ఓ చిన్నారి ఏనుగు గాయపడింది. ఈ సమాచారాన్ని పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ కి తెలిసింది. వెంటనే తన అధికారిక ట్విట్టర్ లో 5వతేదీన ఓ పోస్టును ట్వీట్ చేశాడు. ఓ తల్లి ఏనుగు గాయపడిన తన గున్న ఏనుగును బతికించుకోవడం కోసం అంటూ, ఇదే కదా తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటుగా కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైకు కూడా సమాచారం అందించారు.

24గంటల అనంతరం గాయపడ్డ ఏనుగుకు అటవీ శాఖ సిబ్బంది వైద్య చికిత్సలు అందించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియచేశారు. మొత్తం మీద నెట్టింట హల్ చల్ చేసే కొన్ని సంఘటనలు, విలువైన ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడడం ఎంతైనా ఆనందించ దగ్గ విషయం.

ఇది కూడా చదవండి: తల్లి ప్రేమపై రాహుల్ వ్యాఖ్యలు

ఇవి కూడా చదవండి: