Congress vs BJP: రాష్ట్రంలో టెన్షన్ టెన్షన్..బీజేపీ ఆఫీస్‌పై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ దాడి.. పొట్టుపొట్టున కొట్టుకున్నారు!
Congress Attacked Telangana BJP Office: రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు, రాళ్లతో కాంగ్రెస్ దాడి చేసింది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ నేత వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ రాళ్లు విసిరింది. బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసరడంతో ఓ బీజేపీ కార్యకర్త తలకు గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై ఢిల్లీకి చెందిన బీజేపీ నేత రమేశ్ బిదూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే.. ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తామంటూ రమేష్ బిధూరి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు సైతం ఎదురు దాడికి దిగారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రమేష్ బిదూరీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇదిలా ఉండగా, బీజేపీ ఆఫీస్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు. మేం తలచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్‌ను తగలెడతామన్నారు. దాడి చేసిన కార్యకర్తలను అరెస్ట్ చేయాలని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. మేం తలచుకుంటే కాంగ్రెస్ ఆఫీస్‌ను తగలబెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.