Last Updated:

Chiranjeevi: తారకరత్న కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ, చిరంజీవి

Chiranjeevi: నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Chiranjeevi: తారకరత్న కుటుంబాన్ని పరామర్శించిన బాలకృష్ణ, చిరంజీవి

Chiranjeevi: నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

పాదయాత్రలో భాగంగా లోకేష్ తో కలిసి నడుస్తుండగా.. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదాయలకు తరలించి, 23 రోజులుగా మెరుగైన వైద్యం అందించారు. విదేశాల నుంచి కూడా వైద్యలును రప్పించి చికిత్స అందించారు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. ఇక శనివారం నాడు ఆయన శివైక్యం చెందారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.

సంతాపం తెలిపిన చిరంజీవి, బాలకృష్ణ.. (Chiranjeevi)

తారకరత్న భౌతికకాయనికి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన భౌతికకాయన్ని చూసి.. బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్నకు బాలకృష్ణ అంటే అమితమైన ఇష్టం. ఆయన చేతిపై బాలకృష్ణ సంతకం పచ్చబొట్టుగా కనిపిస్తు ఉంటుంది. ఇక చిరంజీవి సైతం తారకరత్న పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరితో పాటు, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, అలీ, సందీప్ కిషన్ తదితరులు నివాళులు అర్పించారు.

ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు తారకరత్న పార్థీవ దేహం

తారకరత్న అంత్యక్రియలను రేపు నిర్వహించనున్నారు. బాలకృష్ణ నిర్ణయించిన సమయానికే.. అంత్యక్రియలను నిర్వహిస్తామని విజయసాయి రెడ్డి అన్నారు. అభిమానుల సందర్శనార్ధం రేపు ఉదయం.. తారకరత్న పార్ధీవ దేహాన్ని ఫిల్మా ఛాంబర్ కి తరలిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ పై అభిమానం.. ఆయన పేరు కలిసివచ్చేలా పిల్లలకు పేర్లు

తారకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం. అందుకు తగినట్లుగానే.. ఆయన పేరు వచ్చేలా తన పిల్లలకు పేర్లు పెట్టాడు తారకరత్న. మెుదటి పాపకు నిష్క అని పేరు పెట్టగా.. ఆ తర్వాతి బాబు పాపకి తనయ్ రాయ్, రేయా అని పేర్లు పెట్టాడు. వీరి పేర్లలోని మెుదటి అక్షరాలు ఎన్టీఆర్ అని చూపిస్తాయి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/