Last Updated:

Etala vs Ktr: అసెంబ్లీ సమావేశాలు.. ఈటలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.

Etala vs Ktr: అసెంబ్లీ సమావేశాలు.. ఈటలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ Etala vs Ktr గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.

ఈటలకు కేటీఆర్ కౌంటర్..

శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమావేశాల్లో ఈటల అడిగిన ప్రశ్నకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడూతూ.. ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లిన అదానీకి పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కును తుక్కు కింద చేసి కేంద్రం అమ్మట్లేదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ఏ కారణంతో అమ్మాల్సి వస్తుందో చెప్పాలని నిలదీశారు. సింగరేణి విషయంలో కూడా కేంద్రం ఇదే వైఖరితో ఉందన్నారు. ఈ విషయంపై ఈటలకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రాన్ని నిలదీసి అడగాలని కేటీఆర్ సవాల్‌ విసిరారు. దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం తెలంగాణలో లేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్కరికి అనుకూలం కాదు..

తెలంగాణ రాష్ట్రంను కొట్లాడి తెచ్చుకున్నామని.. ఏ ఒక్కరి కోసమే ఈ ప్రభుత్వం పని చేయదని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలమే తప్పా.. ఒక పారిశ్రామికవేత్తకు అనుకూలం కాదన్నారు. తక్కువ ఖర్చుతో దేశీయ బొగ్గు దొరుకుతున్నా.. విదేశాల నుంచి బొగ్గును కొనాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇది ఎవరి కోసం.. ఎవరి ప్రయోజనాల కోసం ఈ బొగ్గును కొనుగోలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఈటల అన్నారు. స్వయంగా ప్రధాని మోదీయే ఈ విషయం చెప్పారని సమావేశంలో తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎలా అమ్మాలని చూస్తున్నారో రేపు సింగరేణిని అలానే అమ్మేస్తారని తెలిపారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను.. దివాళా తీసిందని చెప్పి ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ఇదే వ్యూహాన్ని సింగరేణి విషయంలోనూ కేంద్రం అమలు చేయాలని ప్రయత్నిస్తోందని అన్నారు. సింగరేణికి నిధులు ఎందుకు కేటాయించరో.. కేంద్రాన్ని నిలదీయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు.

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో కేంద్రం కావాలానే అడ్డంకులు సృష్టిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో.. భాజపా నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.