Last Updated:

Niti Aayog Governing Council Meeting: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ రోజు సాయంత్రం జగన్ హస్తినకు బయల్దేరనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి ఆముదాలవలసకు చేరుకుంటారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌

Niti Aayog Governing Council Meeting: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

Andhra Pradesh: సీఎం జగన్ ఢిల్లీ టూర్ ఖరారైంది. ఈ రోజు సాయంత్రం జగన్ హస్తినకు బయల్దేరనున్నారు. అంతకుముందు మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయల్దేరి ఆముదాలవలసకు చేరుకుంటారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు హాజరు అవుతారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌ వెళ్తారు. అక్కడ జరిగే నీతిఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశం అనంతరం సాయంత్రం తిరుగు పయనమవుతారు.

నీతి అయోగ్ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. సెస్ లు, పన్నుల్లో రాష్ట్రాల వాటాల గురించి మాట్లాడనున్నట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు మంత్రులను కూడా కలిసే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి: