Last Updated:

Ambati Rambabu : తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?.. పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు..

ఏపీలో రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. కాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఏ కామెంట్‌ చేసినా.. వెంటనే అధికార పార్టీ నేతలు కౌంటర్లు

Ambati Rambabu : తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?.. పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు..

Ambati Rambabu : ఏపీలో రాజకీయాలు గరం గరంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పెంచుతున్నారు. కాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఏ కామెంట్‌ చేసినా.. వెంటనే అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇచ్చేందుకు రెడీ అవుతూ ఉంటారు. కాగా రిపబ్లిక్ డే సందర్భంగా  “మా నాన్న నాస్తికుడు” అంటూ పవన్‌ చేసిన కామెంట్లపై కూడా ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.

మంగళగిరిలోని జయంసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో పవన్ మాట్లాడుతూ..  మా నాన్న నాస్తికుడు.. మా నాయనమ్మ దీపారాధన చేస్తే సిగరెట్ వెలిగించుకుని దేవుడు లేడు.. దెయ్యం లేడు అనే వాడు.. కానీ, ఆ తర్వాత కాలంలో తానేదో తప్పు చేశానని ప్రతి రోజూ బాధపడేవారు.. అందుకే ఇది మన సంప్రదాయం అని గుర్తించాలి, మన సంప్రదాయాలను గౌరవించాలని వ్యాఖ్యానించారు పవన్‌.

(Ambati Rambabu) అంబటి రాంబాబు ట్వీట్..

అయితే, పవన్‌ వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. పవన్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తండ్రినే అవమానపరిచే పుత్రుడు సమాజానికి అవసరమా ?” అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు.

 

 

 

అలానే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇక, వైసీపీనే కాదు.. ఏ పార్టీ నేత అయినా మళ్లీ వేర్పాటు వాదం గురించి మాట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడని పవన్‌ హెచ్చరించారు.

ఎవడికి వాడు రాష్ట్రం కావాలంటూ స్టేట్మెంట్లు ఇస్తారా..? మీరేం చేశారు.. మీరేమన్నా త్యాగాలు చేశారా..? అంటూ నిలదీసిన ఆయన.. నాది బాధ కాదు.. ఆవేదన అన్నారు.

‘‘మా తాత, మా నాన్న ముఖ్యమంత్రులు కాదు’’ అని పవన్ అన్నారు.

తాను ముఖ్యమంత్రి కావాలని కలలు కనడం లేదని అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది చెందాలంటే.. రాజకీయ స్థిరత్వం ఉండాలని అన్నారు. తమను ప్రజలు అధికారంలో తీసుకొస్తే.. తాను కూలీ మాదిరిగా పనిచేస్తానని చెప్పారు.

‘‘మంత్రి ఇల్లు తగులబడిన సీఎం వెళ్లలేదు.. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు.

అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకి అప్పగించమనడమేంటి ? కోడి కత్తితో గీకించుకుని ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడమేటి ?

ఏపీ డాక్టర్ల మీద నమ్మకం ఉండదు.. హైదరాబాద్‌ వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు.

అధికారంలోకి వచ్చాక ఆ డాక్టర్‌ను ఆరోగ్య శ్రీ పథకంలో చైర్మన్ చేస్తారు.

వైసీపీ ప్రజాప్రతినిధులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారు.. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం.

పోలీసులు రోజు సెల్యూట్ చేసే ముఖ్యమంత్రికి.. వాళ్లంటే గౌరవం లేదు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అంబటి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

ఇవి కూడా చదవండి: