KL Rahul: కేఎల్ రాహుల్ ఆట గురించి.. చాట్ జీపీటీ ఏమందో తెలుసా?
KL Rahul: ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు.. చాట్ జీపీటీ. ఇక క్రికెట్ లో వినిపిస్తున్న మరో పేరు.. కేఎల్ రాహుల్ ఫామ్. గత పది ఇన్నింగ్స్ లలో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ భవితవ్యంపై చాట్ జీపీటీ ఏమందో తెలుసా?
KL Rahul: ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు.. చాట్ జీపీటీ. ఇక క్రికెట్ లో వినిపిస్తున్న మరో పేరు.. కేఎల్ రాహుల్ ఫామ్. గత పది ఇన్నింగ్స్ లలో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ భవితవ్యంపై చాట్ జీపీటీ ఏమందో తెలుసా?
రాహుల్ టెస్టు భవిష్యత్తు ముగిసిందా? (KL Rahul)
భారతదేశ క్రికెట్ లో ఇప్పడు మెుత్తం చర్చ.. కేఎల్ రాహుల్ గురించే నడుస్తోంది. రాహుల్ గత పది ఇన్నింగ్స్ లలో కనీసం ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు. అయినా సరే.. జట్టులో కొనసాగుతున్నాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న కూడా.. వైస్ కెప్టెన్ పదవి ఇవ్వడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగే మిగతా రెండు టెస్టులకు.. వైస్ కెప్టెన్ ట్యాగ్ ను రాహుల్ కోల్పోయాడు. దీంతో పాటు.. తుది జట్టులో చోటు దక్కడంపై అనుమానాలు మెుదలయ్యాయి. పేలవ ప్రదర్శన చేస్తున్న రాహుల్ ను.. జట్టు నుంచి తప్పించాలని ఇదివరకే మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా, హర్భజన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. ఓ అభిమాని రాహుల్ గురించి.. చాట్ జీపీటీ ని ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు చాట్ జీపీటీ అద్భుతమైన సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు చాట్ జీపీటీ గురించే అంతా చర్చించుకుంటున్నారు. తాజాగా కేఎల్ రాహుల్‌ను జట్టులో ఉంచాలా వద్దా అనే దానిపై సమాధానం చెప్పింది.
చాట్ జీపీటీ సమాధానం ఇదే..
చాట్ జీపీటీ ఈ విధంగా సమాధానం చెప్పింది. వ్యక్తులు, క్రికెట్ జట్లపై నాకు వ్యక్తిగత.. పక్షపాత అభిప్రాయం లేదు. రూల్ ప్రకారం.. ఆటగాడి ప్రదర్శన, ఫిట్‌నెస్ ఆధారంగా అతడిని జట్టులో నుంచి తప్పించడానికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జట్టు అవసరాలకు తగిన విధంగా నైపుణ్యాలు లేనప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. టెస్టుల్లో కేఎల్ రాహుల్ ప్రదర్శన అంతంత మాత్రానే ఉంది. కేఎల్ రాహుల్ కన్నా అద్భుతంగా రాణించేవారు జట్టులో ఉన్నారు. ఇలాంటి వారని పరిగణలోకి తీసుకోవాలి. ఏదైనా ఆటగాడు బాగా రాణించి.. జట్టు అవసరాలకు కీలక పాత్ర పోషిస్తున్నాడని నమ్మితే టీమ్ లో కొనసాగించవచ్చని తెలిపింది.
కేఎల్ ను పక్కన పెట్టే సమయం వచ్చింది- దినేష్ కార్తీక్
కేఎల్ రాహుల్ ఆటతీరుపై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇది వరకే కేఎల్ ఆటపై మాజీలు విమర్శలు గుప్పించగా.. తాజాగా సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్ స్పందించాడు. కేఎల్ ఆటపే కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొద్ది రోజులుగా నిరాశపరుస్తున్న రాహుల్ ని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో.. అన్ని ఫార్మాట్లలో కేఎల్ రాహుల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. దీంతో అతడి స్థానంలో మరొకరికి స్థానం కల్పించాలని మాజీలు కోరుతున్నారు. తాజాగా దీనిపై దినేశ్ కార్తిక్ స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని పక్కన పెట్టేందుకు సమయం వచ్చిందని తెలిపాడు.
గత టెస్టు మ్యాచుల్లో ప్రదర్శనను బట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలిపాడు. కేఎల్ మంచి బ్యాటరే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని తొలగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాడు. రాహుల్ క్లాస్ ప్లేయర్.. అన్ని ఫార్మాట్లాలో బాగా ఆడగలడు. కానీ ఈ సమయంలో.. ఇంకా జట్టులో కొనసాగించడం సరైన నిర్ణయం కాదని తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆట నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక రాహుల్ స్థానంలో.. శుభ్‌మన్ గిల్‌ను తీసుకోవాలని డీకే సూచించాడు.