Published On:

Skin Care: ముఖంపై నల్లటి మచ్చలు మాయం కావాలంటే బంగాళాదుంప రసాన్ని ఇలా వాడండి.!

Skin Care: ముఖంపై నల్లటి మచ్చలు మాయం కావాలంటే బంగాళాదుంప రసాన్ని ఇలా వాడండి.!

Skin Care Tips With Potato In Telugu: ఆలుగడ్డ ( బంగాళాదుంప)  రసంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు. ఇది నల్లమచ్చలను తగ్గిస్తుంది. దాని ప్రయోజనాలతోపాటు చర్మాన్ని ఎలా ప్రకాశవంతంగా మార్చగలదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఆలుగడ్డలు అంటే (బంగాళాదుంపలు) తెలియని వారుండరు. ఇది ప్రకాశవంతమైన చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. నల్ల మచ్చలు, మొటిమలు మరియు పిగ్మెంటేషన్ సమస్యలనుంచి రక్షించడానికి బంగాళాదుంప చాలా ఉపయోగపడుతుంది.

 

 

చర్మాన్ని కాంతివంతం చేయడానికి విటమిన్ సి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ మెలనిన్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో నల్ల మచ్చలను అరికడుతుంది. బంగాళాదుంప రసాన్ని క్రమం తప్పకుండా వాడటం వలన కాలక్రమేణా నల్ల మచ్చలు నయమవుతాయి. మరియు చర్మానికి మరింత ప్రకాశవంతమైన రంగు వస్తుంది.

బంగాళాదుంప రసంలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. దీంతో మనుషులకు అకాల వృద్ధాప్యం రాకుండా ఉంటుంది. ఇదే కాకుండా బంగాళాదుంప రసంతో కొత్తగా నల్ల మచ్చలు ఏర్పడకుండా సహాయపడుతాయి.

 

 

ఆలుగడ్డరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది చికాకు కలిగించకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఆలుగడ్డ రసం చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికి ఇప్పటి వరకు అంత ప్రాచుర్యాన్ని దక్కకపోయినా పనిలో మాత్రం అద్భుతాలు చేస్తుంది. దీనిని వాడటం వలన చర్మం ఎప్పటికీ పొడిబారకుండా ఉంటుంది. కొందరికి సెన్సిటివ్ చర్మం ఉంటుంది. అది అనుకోని పరిస్థితుల్లో పొడిబారి చికాకును కలిగిస్తే అక్కడ ఆలుగడ్డ రసాన్ని పూయాలి. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది.

 

 

మొటిమలు తగ్గించుకోవడానికి నల్లటి మచ్చలను తగ్గించుకోవడానికి ఆలుగడ్డ రసం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది సహజమైన అందమైన శరీర కాంతిని ఇస్తుందని చెబుతున్నారు. దీన్ని ప్రతీరోజు వాడటం వలన చాలా ఉపయోగాలు కలిగి ఉనన్నాయని తెలుస్తోంది. దీనికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా అన్ని కూరగాయల దుఖాలలో దొరుకుతుంది. దీన్ని ప్రతీ ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. ఆలు చిప్స్ అంటే ఎంతో మందికి ప్రతీకూడా. అదేవిధంగా దాంతోనే ఆలు రసాన్ని తీసి ముఖానికి అప్లై చేస్తే సరిపోతుంది.

గమనిక.. పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.  డాక్టర్ల సలహాను తీసుకుని వాడగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.

ఇవి కూడా చదవండి: