Home / USA
J D Vance : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఈ నెల 21 భారత్ పర్యటనకు రానున్నారు. విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. జేడీ వాన్స్ ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇటలీతోపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన ఇరుదేశాల నేతలతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయాలపై చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని […]
China-USA : అగ్రరాజ్యం అమెరికా, చైనా ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను డ్రాగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను అమెరికా 145 శాతానికి పెంచగా, డ్రాగన్ నుంచి కూడా అదే రియాక్షన్ వచ్చింది. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచింది. చైనాపై విధించిన సుంకాలు 145శాతం.. చైనాపై విధించిన సుంకాలను లెక్కిస్తే 145శాతంగా ఉంటాయని అమెరికా శ్వేతసౌధం కార్యనిర్వాహక ఉత్తర్వు వెల్లడించింది. […]
Employment crisis in USA, big shock to H1B visa holders: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులకు ప్రస్తుతం కంటిమీద కునుకులేకుండా పోతోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రోజుకో కొత్త నిబంధన తీసుకువచ్చి అటు యాజమాన్యాలకు.. ఇటు ఉద్యోగులకు ముప్పు తిప్పులు తెచ్చిపెడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలో హెచ్1బీ వీసాలపై అమెజాన్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యగులు అభద్రతా భావానికి గురవుతున్నారు. మనశ్శాంతి కరువైంది. […]
Trump tariffs : ఇండియాతోపాటు అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిపై ప్రకటన చేయనుండగా, వెంటనే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికాకు ఏటా భారీస్థాయిలో ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏటా 600 బిలియన్ల నుంచి 700 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరనున్నట్లు అంచనా వేసింది. కొత్త టారిఫ్‌ల వల్ల ఏటా 600 […]
Mass Shooting at USA New Mexico park 3 Dead: అమెరికాలో మరోసారి కాల్పుల మోత రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన ఓ కారు ప్రదర్శనలో రెండు గ్రూపుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్త పెద్దదిగా మారడంతో పరస్పరం రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. ఈ కాల్పులతో కారు ప్రదర్శనకు చూసేందుకు వచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. […]
Donald Trump Signs Order To Shut Down US Education Department: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు మార్పులు తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఖర్చులకు సంబంధించి వ్యయం తగ్గింపులపై ప్రత్యేక దృష్టి సారించిన ట్రంప్.. విద్యాశాఖను మూసివేశారు. కాగా, ఇటీవల విద్యాశాఖలో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించారు. కాగా, అమెరికా విద్యాశాఖ మూసివేత ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం […]
USA : యెమెన్‌లోని హూతీలపై అగ్రరాజ్యం అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైనిక చర్యలకు పాల్పడింది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా, 101 మంది గాయపడినట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా నౌకలు, విమానాలపై హూతీలు దాడులు చేయడాన్ని సహించేది లేదని యూఎస్ ‘సెంట్రల్ కమాండ్’ పేర్కొంది. […]
US pauses intelligence sharing with Ukraine: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో అమెరికా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అమెరికా నిర్ణయాలతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ పరిస్థితి ఉక్రెయిన్‌ది. అటు యూరప్ మీద కూడా అమెరికా ఒక్కొక్క షాక్ ఇస్తోంది. నాటోలో ఎప్పటికీ ఉక్రెయిన్ భాగస్వామి కాలేదని అమెరికా తేల్చి చెప్పింది. యుద్ధం ఆపటానికి ఇప్పటికే సైనిక సాయం ఆపేసిన అమెరికా, నిఘా సమాచారాన్ని కూడా ఆపేసింది.అంతేకాదు.. అమెరికా వచ్చిన లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థులను అక్రమ వలసదారులుగా […]
Plane Crash In America: అమెరికాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. టేకాఫ్ అవుతుండగా.. విమానం ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్ల మధ్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం జరిగిన చుట్టూపక్కల ప్రాంతాల్లో మంటలు చెలరేగి ఇళ్లతోపాటు పార్కింగ్ లో ఉన్న వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనలో చాలామంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Gun Fire in USA Hyderabad Student Died: అగ్ర రాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ యువకుడిపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు చేశాడు. ఈ కాల్పుల్లో చైతన్యపురికి చెందిన రవితేజ అనే వ్యక్తి మృతి చెందాడు. అతడు మృతి చెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అయితే ఉన్నత చదువుల కోసం రవితేజ మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లినట్లు అతని బంధువులు చెబుతున్నారు. అయితే 2022లో అమెరికా వెళ్లిన […]