Home / Russia-Ukraine war
ఉక్రెయిన్ పై రష్యా 122 క్షిపణులు మరియు 36 డ్రోన్ల తో భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. 22 నెలల యుద్ధంలో శుక్రవారం జరిగినది అతిపెద్ద వైమానిక దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సుమారు కనీసం 20 మంది పౌరులు మరణించారు. ఉక్రెయిన్ వైమానిక దళం 87 క్షిపణులు, 27 డ్రోన్లను అడ్డగించిందని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ వాలెరి జలుజ్నీ చెప్పారు.
Cluster Bombs: రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఈ విధ్వంసం ఆగలేదు. యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కసితో ఉక్రెయిన్, ఆయుధాల కోసం అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Russia: రష్యాలో వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు సమయంలో రొస్తోవ్ నగరం నుంచి తప్పించుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఎట్టకేలకు కనిపించారు. సోమవారంనాడు ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించారు దీనిపై ఆ దేశ రక్షణ శాఖ ఓ వీడియో రిలీజ్ చేసింది.
పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని ఆరోపించిన వెంటనే దాడుల జోరును పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రెండు దేశాలూ పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో 262 మంది ఉక్రెయిన్ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోగా, 363 క్రీడా సౌకర్యాలు ధ్వంసమయ్యాయని ఆ దేశ క్రీడా మంత్రి వాడిమ్ హట్సైట్ తెలిపారు.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ విజిటింగ్ ప్రెసిడెంట్ మోరినారీ వతనాబేను కలిసిన హట్సైట్, రష్యా నుండి ఏ అథ్లెట్లను ఒలింపిక్స్ లేదా ఇతర క్రీడా పోటీలలో అనుమతించరాదని అన్నారు
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.
: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అత్యంత సంపన్నులు గత ఏడాది అంటే 2022లో పది శాతం సంపద కోల్పోయారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
రష్యా - ఉక్రెయిన్ యుద్దానికి సరిగ్గా శుక్రవారంతో ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో ఉక్రెయిన్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నిరంతరం క్షిపణిదాడులతో దేశం మొత్తం శ్మశానం అయ్యింది
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ... రష్యాకు కోలుకోలేని దెబ్బతగిలింది. రష్యాకు చెందిన సుమారు 63 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా కూడా అంగీకరించింది.