Joe Biden: జో బైడెన్ కు క్యాన్సర్.. అధికారుల ప్రకటన

Joe Biden Diagnosed Prostate Cancer: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ ఇప్పుటు ఎముకలకు కూడా వ్యాపించిందని డాక్టర్లు నిర్ధారించారు. అందుకు సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు.
కాగా జో బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకోగా అసలు విషయం బయటకు వచ్చింది. అయితే జో బైడెన్ కు ఎలాంటి చికిత్సలు అందించాలో వైద్యులు సమాలోచనలు చేస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్ సెన్సిటీవ్ గా ఉంటుంది. అందువల్ల చికిత్స చేయడం ఈజీ అవుతుంది. హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, ఎముకలకు కూడా చికిత్స చేయనున్నారు. అయితే ఆయనకు క్యాన్సర్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసింది.
కాగా జో బైడెన్ అనారోగ్యంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కు క్యాన్సర్ నిర్ధారణ జరిగినట్టు తనకు తెలసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. బైడెన్ వార్త విని తాను, మెలానియా చాలా బాధపడ్డామని చెప్పారు. కాగా క్లిష్ట సమయంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబానికి అండగా ఉంటామని అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బైడెన్ పోరాట యోధుడని, క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పారు.