Home / అంతర్జాతీయం
ఇండియా నుంచి మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు ప్రస్తుతం కిర్గిస్తాన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.
ప్రపంచంలోని టాప్ 25 కంపెనీలకు ఇండియన్స్ సీఈవోలుగా పనిచేస్తున్నారు. అదే మన పిల్లలు ఆకలితో చస్తున్నారని పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సయ్యద్ ముస్తాఫా కమల్ అనే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నాడు ఆయన నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ విద్యా వ్యవస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా! ఇండియాకు చెందిన ఓ వ్యాపారి తన లగ్జరీ కారు రేంజి రోవర్‌ను కేరళ నుంచి దుబాయికి తీసుకువెళ్లి ప్రపంచంలోనే అత్యంతఎత్తైన ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా ముందు పార్క్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
పాకిస్తాన్‌ను ప్రస్తుతం దుబాయి ప్రాపర్టీ లీక్స్ నిలువునా వణికిస్తోంది. దుబాయిలో అత్యంత ఖరీదైన విల్లాలు పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మిలిటరీ, బ్యాంకర్లు, బ్యూరక్రసీకి చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు.
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ అనే నగరంలో ఒక అపార్ట్మెంట్ భవనంలో కొంత భాగం కూలి 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. భవనం విధ్వంసానికి ఉక్రెయిన్ బాంబుదాడులే కారణమని రష్యా అధికారులు ఆరోపించారు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలు, రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలతో బయటపడిన వారి కోసం శిధిలాల గుండా వెతుకుతూవెళుతున్నట్లు చూపిస్తున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్లోని ఉత్తర ప్రావిన్స్ బగ్లాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో సుమారుగా 50 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.
అమెరికాలోని న్యూయార్కు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ గొంతుకు బెల్టు వేసి ఈడ్చుకుంటూ ఓ కారు వెనక్కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన సీసీ కెమరాలకు చిక్కింది. ఒళ్లు గగొర్పొరేడ ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరే అడ్డదార్లు తొక్కతే ఎలా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు దెబ్బతినడయే కాకుండా తమ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేసుకున్న వారు అవుతారు. ఇక వివరాల్లోకి వెళితే బ్రిటన్‌కు చెందిన ఓ టీచర్ తన సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి తన స్కూల్ పిల్లలకు తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టారు
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన కోవిడ్ -19కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ అరికట్టేందుకు మార్కెట్లోకి కొన్ని వ్యాక్సిన్లు వచ్చాయి. వాటిలో బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ర్టాజెనెకా ఒకటి.