Published On:

Pakistan PM on Indus River : సింధు నది జలాలపై పాకిస్తాన్ కీలక ప్రకటన!

Pakistan PM on Indus River : సింధు నది జలాలపై పాకిస్తాన్ కీలక ప్రకటన!

Pakistan PM on Indus: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా అడుగులు వేస్తుంది. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ కు తగినశాస్తి చేసేందుకు రెడీ అయ్యింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్థాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది.

 

పాకిస్తాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ భారత్ నిర్ణయాన్ని తప్నుబట్టారు. ఇది చట్ట విరుద్దమని అన్నారు. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిగా ఉన్న ఒప్పందాన్ని అంత సులువుగా వదులుకోలేరన్నారు. సింధు జలాల్లో ప్రతీ నీటిచుక్క తమదేనని చెప్పారు. తన నీటి హక్కును న్యాయపరంగా దక్కించుకుంటామన్నారు.

 

భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాకిస్థాన్ పీఎం షహనాజ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటిలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులతో పాటు మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 1960లో భారత్, పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. పహల్గా ఉగ్రదాడి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

 

పహల్గాం దాడిని పాకిస్తాన్ పీఎం ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ను తప్పుగా చూపెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారిన పీఎం షెహనాజ్ ను ప్రశ్నించారు. పహల్గాంలో దాడి జరిగితే పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు అప్రమత్తమైందని అన్నారు. తప్పకుండా పాక్ ప్రధాని ఉగ్రవాదులను దాస్తు్న్నారని సిగ్గుచేటని విమర్శించారు. తాను పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడటంలేదని ప్రపంచం ముందు పాక్ దోషిగా నిలపడటం ఇష్టం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.