Home / అంతర్జాతీయం
దక్షిణ గాజాలోని పాఠశాల వెలుపల శరణార్దుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 29 మంది మరణించగా పలువురు గాయపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ నగరానికి తూర్పున ఉన్న అబాసన్ అల్-కబీరా పట్టణంలోని అల్-అవుదా పాఠశాల గేటు పక్కన మంగళవారం ఈ దాడి జరిగిందని గాజా హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇండోనేషియాలోని సెంట్రల్ ద్వీపం సులవేసిలో ఒక అక్రమ బంగారు గని సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించగా 19 మంది తప్పిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.
ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన భారీ వైమానిక దాడలో 20 మంది మరణించారు. సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది మరణించారు. ఈ దాడి గత కొద్దినెలలుగా జరగుుతున్న దాడుల్లో అతిపెద్దదాడిగా చెప్పవచ్చు.
ఆన్లైన్ పోర్న్‌కి పిల్లల యాక్సెస్‌ను పరిమితం చేసే ప్రయత్నంలో, స్పానిష్ ప్రభుత్వం పోర్న్ పాస్‌పోర్ట్ అనే అప్లికేషన్‌తో ముందుకు వచ్చింది.డిజిటల్ వాలెట్ బీటా (కార్టెరా డిజిటల్ బీటా)గా పిలువబడే ఈ అప్లికేషన్ ఈ వారం ప్రారంభమయింది.
మౌరిటానియా తీరంలో ఈ వారం వలసదారుల పడవ బోల్తా పడటంతో 89 మృతదేహాలను వెలికితీసినట్లు మత్స్యకార సంఘం అధిపతి తెలిపారు.పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు అట్లాంటిక్ వలస మార్గం
బ్రిటన్ ఎన్నికల ఫలితాల్లో ప్రధాని రిషి సునాక్ కు షాక్ తగిలింది. ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ ఓడిపోయారు. యూకేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మెజార్టీ స్థానాలను ఆపార్టీ కైవసం చేసుకుంది.
పాకిస్తాన్లో కొత్త పన్నులు విధించిన తరువాత పాల ధరలు 20 శాతం పైగా పెరిగాయి. దీనితో కరాచీలోని సూపర్ మార్కెట్లలో లీటరు పాల ధర 370 రూపాయలకు చేరింది. తాజా పెంపుతో ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు కొన్ని ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే పాల ధర పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంది.
అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త రిషి షా తన అడ్వర్టైజింగ్ స్టార్టప్‌కు సంబంధించిన రూ8,300 కోట్ల మోసానికి పాల్పడినట్లు రుజువుకావడంతో అతనికి ఏడున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా 2024లో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో ప్రెసిడెంట్ జో బైడెన్ పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉందన్న వార్తలు పచ్చిన నేపధ్యంలో అతడిని అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించవచ్చని తెలుస్తోంది.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్‌తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.