Published On:

Floods: నైజీరియాలో వరద విలయం.. పెరుగుతున్న మరణాలు

Floods: నైజీరియాలో వరద విలయం.. పెరుగుతున్న మరణాలు

Nigeria: నైజీరియాలో భారీ వర్షాలతో వచ్చిన వరదలు దేశంలో విలయ తాండవం చేశాయి. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. నైగర్ రాష్ట్రంలోని మోక్వా పట్టణంలో భారీ వరదలతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటివరకు 700 మంది మరణించినట్టు అంచనా వేస్తున్నారు.

 

కాగా గత గురువారం కుండపోత వర్షంతో భారీ వరదలు సంభవించాయి. దాదాపు ఐదు గంటల్లోనే వరదలు మోక్వా పట్టణాన్ని ముంచెత్తింది. దీంతో వరదల్లో ఇప్పటి వరకూ 200 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 500 మంది వరకు గల్లంతయ్యారు. వరదల్లో వీరంతా మరణించారని అధికారులు భావిస్తున్నారు. అందుకే సహాయక చర్యలను నిలిపివేసినట్టు స్థానిక అధికారి ముసా కాంబోకు తెలిపారు.

 

నైగర్ రాష్ట్రంలో వాణిజ్య పరంగా మోక్వా కీలక ప్రాంతం. ఇక్కడ భారీగా వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అందుకే అకస్మాత్తుగా వచ్చిన వరదలతో భారీగా ప్రాణనష్టం కలిగింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. వంతెనలు పూర్తిగా తెగిపోయాయి. పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంద్రి ప్రజలు నిరాశ్రయులయ్యారు.