Last Updated:

Huge Floods In America: అమెరికాలో భారీ వర్షాలు.. 9మంది మృతి

Huge Floods In America: అమెరికాలో భారీ వర్షాలు.. 9మంది మృతి

Huge Floods In America Seven Members Died: అమెరికాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు 9మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ఆగ్నేయ ప్రాంతంలోని కెంటకీలో కుంభవృష్టి కారణంలో భారీ వరదలు ముంచుకొచ్చాయి.

ఈ వరదల ధాటికి ఓ మహిళతోపాటు ఆమె ఏడేళ్ల కుమారుడు కారుతో పాటు వరదల్లో కొట్టుకుపోయారు. అలాగే క్లే కౌంటీలో 73 ఏళ్ల వృద్దుడు కూడ చిక్కకుని కొట్టుకుపోయాడు. దీంతో పాటు అట్లాంటాలొ చెట్టు విరిగి పడడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

రెండు రోజులుగా కెంటకీ, టెన్నెస్సీలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం నమౌదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమెరికాలో చలి వణికిస్తుండగా.. ఆ దేశం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వరదల ప్రభావానికి పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ మేరకు ఫెడరల్ నిధులు వినియోగించి అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి: