Published On:

Himachal Floods: హిమాచల్ వరదల్లో 250 మంది సేఫ్

Himachal Floods: హిమాచల్ వరదల్లో 250 మంది సేఫ్

Rescue Team Saves peoples: దేశంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీగా వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో వచ్చిన ఆకస్మిక వరదలు పలు జిల్లాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కాంగ్రా, కులు జిల్లాల్లో సంభవించిన వరదల్లో ఐదుగురు మృతిచెందారు. ధర్మశాలలోని కొన్ని ప్రాంతాలను కూడా వరదలు చుట్టుముట్టాయి. అలాగే ఆకస్మికంగా వచ్చిన వరదలతో వందలాదిగా ప్రజలు కొట్టుకుపోయినట్టు కాంగ్రా ఎస్పీ షాలిని అగ్నిహోత్రి చెప్పారు.

వరద సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగాయి. వరదలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 250 మందికిపైగా ప్రజలను రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. దీనిపై ఎస్పీ షాలిని మాట్లాడారు. “ఆకస్మికంగా వచ్చిన వరదల్లో కొందరు గల్లంతయ్యారు. నిన్న ఎస్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, హిమాచల్ ప్రేదేశ్ హోమ్ గార్డ్ వాలంటీర్లు.. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు 250 మందిని రక్షించారు. నిన్న రెండు మృతదేహాలు లభించగా.. ఇవాళ మూడు డెడ్ బాడీలను గుర్తించారు. మరోవైపు గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: