Home / Nigeria
ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బుర్కినా ఫాసోతో ఉన్న సరిహద్దు సమీపంలో ఉగ్రవాద బృందంఆకస్మికంగా దాడి చేసి 21 మంది నైజీరియన్ సైనికులను చంపినట్లు నైజర్ పాలక మిలిటరీ జుంటా ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగిన ఈ దాడి వెనుక ఏ గ్రూపు ఉందో పేర్కొనలేదు.
నైజీరియాలో దారుణంగా చోటు చేసుకుంది. ఉత్తర మధ్య పీఠభూమిలో జురాక్ గ్రామంలో తుపాకీ ధరించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 40 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
సెంట్రల్ నైజీరియాలో గ్రామాలపై వరుస దాడుల్లో భాగంగా సాయుధ గ్రూపులు సుమారుగా 160 మందిని చంపినట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు సోమవారం తెలిపారు. మొదట కేవలం 16 మంది మరణించినట్లు సైన్యం ప్రకటించినప్పటికీ తరువాత మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా, 70 మందికి పైగా తప్పిపోయారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యాపారులతో సహా 100 మందికి పైగా ఉన్నారు.
నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఆదివారం అర్థరాత్రి సెంట్రల్ నైజీరియాలో ముష్కరులు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన కనీసం 26 మంది మరణించగా ఎనిమిది మంది గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని రక్షించే హెలికాప్టర్ సోమవారం ఉదయం క్రాష్ అయ్యిందని, ఇక్కడ సైన్యం క్రిమినల్ గ్రూపులతో పోరాడుతున్నదని వైమానిక దళ ప్రతినిధి చెప్పారు.
ఉత్తర నైజీరియాలో వివాహ వేడుక నుండి తిరిగి వస్తున్న పడవ బోల్తా పడింది, దీని ఫలితంగా సోమవారం పిల్లలతో సహా కనీసం 103 మంది మరణించారు. రాష్ట్ర రాజధాని ఇలోరిన్ నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారా రాష్ట్రంలోని పటేగి జిల్లాలో నైజర్ నదిపై సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడింది.
Africa: ఆఫ్రికాలోని నైజీరియాలో సాయుధులు నరమేధం సృష్టించారు. ఈ నరమేధంలో 50 మందిని ఊచకోత కోశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు.
నైజీరియా యొక్క నైజర్ డెల్టా ప్రాంతంలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగార స్థలం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 12 మంది మరణించారు, అయితే స్థానిక నివాసితులు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.