Home / Imran khan
Islamabad Under Lockdown Ahead Of Massive PTI Protest Over Imran Khan’s Release: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. పలు రాజకీయ కారణాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దేశ వ్యాప్తంగా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఎం షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ […]
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రాబీబీ పలు కేసుల్లో జైల్లో ఉన్నారు. అయితే ఖాన్ భార్య బుష్రా బీబీకి జైల్లో ఆహరంలో టాయిలెట్ క్లీనర్ కలిపి ఇస్తున్నారని ఆమె అధికారి ప్రతినిధి ఆరోపించారు. అయితే దీనిపై కోర్టు మెడికల్ టెస్ట్‌లు జరిపించాలని ఆదేశించినా జైలు అధికారులు మాత్రం పట్టించుకోలేదని ఆమె అధికార ప్రతినిధి మషాల్ యుసుఫ్‌జాయ్ చెప్పారు.
తోషాఖానా కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన భార్యకు బుష్రాబీబీకి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఈ జంట పది సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీనితో పాటు వీరిద్దరు 78.7 కోట్ల రూపాయలు జరిమనా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పిటిఐ వ్యవస్థాపకుడు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన షా మహ్మద్ ఖురేషిని అధికార రహస్యాల చట్టం కింది పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది.పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్, వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీలకు సైఫర్ కేసులో పాకిస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తోషా ఖానా కేసులో భారీ ఊరట లభించింది. ట్రయల్ కోర్టు తోషా ఖానా కేసులో ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ నెల 5వ తేదీన ఖాన్ అరెస్టు అయ్యి అటాక్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
తోషాఖానా కేసులో అరెస్టై.. జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఓ చీకటి గదిలో ఉంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను ఆ పురుగుల జైల్లో ఉండలేనని.. అక్కడ నుంచి తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోయారు. సీ-క్లాస్ వసతులున్న జైల్లో పెట్టారని.. ఆ జైలు గదిలోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది.
తోషాఖానా కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడిన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు కూడా ఇమ్రాన్ ఖాన్ ఐదేళ్లపాటు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది.శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌పై నమోదైన తోషాఖానా కేసును ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) మంగళవారం "అమోదయోగ్యం కాదు" అని ప్రకటించింది. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్ తీర్పు ఇమ్రాన్ ఖాన్‌కు ఊరటనిచ్చింది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీలో రిక్షాలో సరిపడేటంత సభ్యులు మాత్రమే ఉన్నారని పీఎంఎల్ నాయకురాలు నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ సెటైర్లు వేసారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షుజాబాద్‌లో జరిగిన యువజన సమ్మేళనాన్ని ఉద్దేశించి మరియం నవాజ్ మాట్లాడుతూ ఈ రోజు అతను పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఆర్గనైజర్ మరియు అధికార ప్రతినిధి మరియు తన పార్టీ అభ్యర్థి మాత్రమే అని అన్నారు.
అవినీతి కేసులో అరెస్టయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైద్యపరీక్షలో మద్యం, కొకైన్ వాడినట్లు వెల్లడయింది.ఐదుగురు వైద్యులతో కూడిన ప్యానెల్ తయారు చేసిన వైద్య నివేదికపై ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు