Covid-19 is Back: కరోనా వచ్చేస్తోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
COVID 19 is Back Symptoms and Precautions: ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని భయానికి గురిచేసిన వైరస్… కరోనా (కోవిడ్ 19). ఏకంగా మూడు సంవత్సరాలపాటు ( 30జనవరి 2020 – మే 5 2023 ) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ప్రజల అభివృద్ధిని అమాంతం నేలకేసి కొట్టింది. ప్రజల ప్రాణాలు దూదిపింజలా మారిన రోజులవి. తాజాగా మరోసారి ఇప్పుడు కరోనా పేరు వినవస్తోంది. ఇప్పటికే చైనా, భారత దేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికా, సింగపూర్, హాంకాంగ్ లో కూడా (COVID 19) కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇది కోవిడ్ యెక్క NB.1.8.1 అనే వేరియంట్ అని గుర్తించారు.

corona virus update all countries on test
కాలిఫోర్నియా, వాషింగ్టన్, వర్జీనియా, న్యూయార్క్ విమానాశ్రయాలకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులలో NB.1.8.1 వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1నుండి ఉద్బవించింది. ఆసియాలోని అన్ని ప్రాంతాలలో వేగంగా వ్యాపించిన తర్వాత అమెరికాలో వ్యాప్తిస్తుంది. ప్రస్తుతం డాక్టర్లు దీని వేగాన్ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఎంత ప్రమాదకరమో తెలుసుకునే ప్రయత్నం చెద్దాం.

corona virus update all countries on alert medicine
NB.1.8.1 అనే వేరియంట్ మొదట చైనాలో గుర్తించబడింది. ఇది దేశంలోని వివిద ప్రాంతాలలో కనుగొనబడుతోంది. ఈ వేరియంట్ కారణంగా COVID 19 కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. World Health Organization (WHO) ప్రకారం, NB.1.8.1 కొన్ని దేశాలలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఎక్కువగా అనారోగ్యాన్ని కలిగించడం లేదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలని హెచ్చరిస్తు్న్నారు.

corona virus update all countries on alert mask
NB.1.8.1 వేరియంట్ యెక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటే. మునుపటి ఓమిక్రాన్ వేరియంట్ ల మాదిగానే ఉంటాయి. అవి వరుసగా… గొంతు నొప్పి, అలసట, తేలికపాటి దగ్గు, జ్వరం, కండరాల నొప్పి, శ్వాస సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కోవిడ్ 19 లక్షణాలే. వీటితో పాటు జ్వరం, తల నొప్పి వికారం, ఆకలి లేకపోవడం, జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంతకు మునుపు కోవిడ్ 19 వ్యాప్తి చెందినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటివే ఇప్పుడు తీసుకోవాలి. ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, చేతికి సానిటైజర్ వాడటం తప్పనిసరి.