South Africa: దక్షిణాఫ్రికా బార్ లో కాల్పుల కలకలం.. 14 మంది మృతి.. పలువురికి గాయాలు
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్‌షిప్‌లోని బార్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.

South Africa: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్‌షిప్‌లోని బార్‌లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.
తాము సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు, 12 మంది మరణించారని చెప్పారు. మరో 11 మందిని గాయాలతో ఆసుపత్రికి తరలించామని, అయితే ఇద్దరు చనిపోయారని అన్నారు. దీనితో చనిపోయినవారి సంఖ్య 14కి పెరిగిందని తెలిపారు.