Best Times to Eat: ఏ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు
ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు.

Best Times to Eat: ఈ కాలంలో ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకుంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అదే విధంగా మంచి ఆహారంతో పాటు అది తీసుకునే సమయం కూడా ముఖ్యమంటున్నారు పోషకార నిపుణులు. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం లాంటి విషయాల్లో జాగ్రత్తలు ఎలా అవసరమో.. ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరమంటున్నారు. లేదంటే పోషకాహారం తీసుకున్నా తగిన ఫలితం ఉండదని చెబుతున్నారు. దానికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రోజులో ఏయే ఆహార పదార్థాలను ఏ సమయంలో తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో చూద్దాం.
పాలు
రాత్రి పూట పాలు తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కటి నిద్ర పడుతుంది. ఉదయం పాలు తాగడం వల్ల జీర్ణం అయ్యేందుకు అధిక సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోక పోవడమే మంచిది. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్లు ఉదయం పాలను తాగవచ్చు.
యాపిల్
యాపిల్స్ ఉదయం తినడం మంచిది. దీని వల్ల మలబద్దకం సమస్య తొలగి పోతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. యాపిల్స్‌ను రాత్రి పూట తినడం మంచిది కాదు. రాత్రిళ్లు యాపిల్స్ తీసుకోవడం వల్ల యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌ను సాయంత్రం తీసుకోవాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరి పోతుంది. అదే ఉదయం, రాత్రి పూట వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవు.
పప్పు ధాన్యాలు(Best Times to Eat)
శనగపప్పు, పల్లీలు, కంది పప్పు, చిక్కుడు లాంటి గింజ, పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట తీసుకోవడం మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు
పెరుగును పగటి పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తీసుకోవడం మంచిది. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
అన్నం
అన్నం మధ్యాహ్న భోజనంగా తీసుకోవడం మంచిది. దీని వల్ల శరీరంలో ఉన్న కార్బోహైడ్రేట్లు ఎక్కువగా వినియోగమవుతాయి. అదే విధంగా రాత్రి పూట అన్నం తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది.
ఇవి కూడా చదవండి:
- PVP vs Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ సెటైర్లు.. ఏంటీ నీ వెధవ సోది అంటూ !
- GST Collections: మే నెల జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?