Last Updated:

PVP vs Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ సెటైర్లు.. ఏంటీ నీ వెధవ సోది అంటూ !

విజయవాడలో రాజకీయాలు ఎండ దెబ్బ కంటే మరింత వేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని విషయం బెజవాడలో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్

PVP vs Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ సెటైర్లు.. ఏంటీ నీ వెధవ సోది అంటూ !

PVP vs Kesineni Nani : విజయవాడలో రాజకీయాలు ఎండ దెబ్బ కంటే మరింత వేడిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎంపీ కేశినేని విషయం బెజవాడలో హాట్ టాపిక్ గా మారుతుంది. కాగా ఇటీవల కాలంలో టీడీపీపై గుర్రుగా ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని టికెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా నాకేంటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. తనకు టీడీపీ టిక్కెట్టు వస్తుందా రాదా అనే విషయమై బెంగలేదన్నారు. తన వ్యాఖ్యలపై పార్టీ చర్యలు తీసుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇప్పుడు తాజాగా ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ సెటైర్లతో విరుచుకుపడ్డారు. ‘ఏంటీ నీ వెధవసోది ఆపు.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. ఏంటీ నీ బిల్డప్ ఏందయ్యా అంటూ మాటల తూటాలు పేల్చారు. దొబ్బేది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు ఇంకా ఏంటో.. ప్రజాసేవల చేయటానికే వచ్చానంటావు ఏంటీ.. నీ బిల్డప్ ఏంటయ్యా బాబూ అంటూ నెక్స్ట్ లెవెల్లో విమర్శలు కురిపించారు. మన బెజవాడోళ్లందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి. వెధవ సోది ఆపి, కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికలకు దొర్లుకుంటూ వద్దువు’ అని ట్విటర్ వేదికగా కేశినేనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా..గత ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ ఓటమి పాలైన విషయం తెలిసిందే.

 

కాగా కొన్ని రోజుల క్రితం వైసీపీ నేతలపై నాని ప్రశంసలు కురిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఎంపీ నిధులతో రూ.47.00 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్‌ ట్యాంక్‌ను నాని ప్రారంభించారు. ఆ సందర్భంగా నాని వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు. అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కేటాయిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు సహకరిస్తానని చెప్పారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమైతే బాగుంటుందని అన్నారు. దీంతో నాని వచ్చే ఎన్నికల్లో టీడీపీని కాదని వైసీపీలో చేరతారేమో అనే పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పీవీపీ ఈ రకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం రచ్చ రచ్చగా మారింది.