Last Updated:

Health Tips : ఏ బ్లడ్ గ్రూపు వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసా..?

సాధారణంగా మనిషికి నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అతి కొద్ది మందిలో మాత్రమే ఈ నాలుగు గ్రూపులు కాకుండా ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్స్ ని మనం గమనించవచ్చు. అయితే వారి వారి బ్లడ్ గ్రూప్ కి తగ్గట్టు పలు రకాల ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Health Tips : ఏ బ్లడ్ గ్రూపు వారు ఏ ఆహారం తీసుకుంటే మంచిదో తెలుసా..?

Health News: సాధారణంగా మనిషికి నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అతి కొద్ది మందిలో మాత్రమే ఈ నాలుగు గ్రూపులు కాకుండా ప్రత్యేకమైన బ్లడ్ గ్రూప్స్ ని మనం గమనించవచ్చు. అయితే వారి వారి బ్లడ్ గ్రూప్ కి తగ్గట్టు పలు రకాల ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఏ గ్రూప్ రక్తం వారికి ఏ ఆహారం అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందనే వివరాలు మీకోసం ప్రత్యేకంగా…

ఏ గ్రూపు : ఏ గ్రూపు రక్తానికి చెందిన వారి రక్తంలో సున్నితమైన ఇమ్యూనిటీ ఉంటుంది. అందుకే వీరు ఎక్కువగా వారి ఆహారంలో పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు ఉండేలా చూసుకోవడం ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే ఈ గ్రూపు వారు మాంసం ఉత్పత్తులను తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు.

బీ గ్రూపు : బీ గ్రూపుకి చెందిన వారు కూరగాయలు, గుడ్డులు ఎక్కువగా తీసుకోవడం మంచిది. అలానే కొద్దిగా మాంసం, తక్కువ కొవ్వు ఉండే పాలను తీసుకోవచ్చని అంటున్నారు. అదే విధంగా మొక్కజొన్న, గోధుమలు, టమోటాలు, వేరుశనగలు, నువ్వులు తక్కువగా తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఓ గ్రూపు : ఈ రక్త వర్గానికి చెందినవారు ఎక్కువగా ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, కూరగాయలు, మాంసం ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు తెలిపారు.

ఏబీ గ్రూపు : ఏబీ గ్రూప్‌ లోని వ్యక్తులు సీ ఫుడ్, టోఫు, డెయిరీ, బీన్స్, ఆకుకూరలు, ధాన్యాలను ఎక్కువగా తినాలి. కానీ మొక్కజొన్న, చికెన్‌ కొంచెం తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: